Wednesday, May 15, 2024
- Advertisement -

జగన్ పై దూకుడు పెంచిన అధికార పక్షం

- Advertisement -

మొన్న అనంతపురం ఎంపీ జేసీ దివకర్ రెడ్డి ఒక రేంజ్ లో జగన్ పై విరుచుకుపడగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలుపు మొక్క. కలుపు మొక్కలాంటి జగన్ ను ఎవరైనా దగ్గరకు తీసుకుంటారా? అంటూ.. కడపలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. బీజేపీతో దగ్గరవ్వడం కోసం జగన్ చేస్తున్న ప్రయత్నంలో ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పని చేస్తాయనే విషయంను జగన్ గుర్తించాలని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాధించిన జగన్.. మళ్లీ అధికారంలోకి వచ్చి పది లక్షల కోట్లు సంపాధించే ధ్యేయంగా పెట్టుకున్నారని ఎద్దైవ చేశారు.

జగన్ మళ్లీ ఖచ్చితంగా జైలుకు వెళ్లేడం ఖయామని.. పార్టీ జెండా పీకేయడం కూడా ఖయామని జోష్యం చెప్పాడు. రాయలసీమకు నీలు ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. జగన్ అడ్డు పడుతున్నాడని.. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -