Thursday, May 16, 2024
- Advertisement -

రేణు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇటివలే ఆమె అనారోగ్యానికి గురైన సమయంలో ఈ ఆలోచన వచ్చినట్లు ఆమె తెలిపారు. ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఏడాది క్రితం తన మనసులో పెళ్లి ఆలోచన లేదని.. కానీ తన ఆరోగ్యంణ్ బాలేని స్మయంలో తనకు ఎవరైన హెల్ప్ చేస్తే బాగుండనిపించిందని.. ఆసుపత్రికి తీసుకెళ్లడం కానీ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని అన్నారు.

ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు మా అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు అని తెలిపింది. ఆ టైంలోనే నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని.. ఆరోగ్యం బాగున్న టైంలో నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్నా. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది. చూద్దాం ఏదైనా రాసుంటే.. ఎందుకంటే మనకు తెలీదు కదా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రస్తుతానికి ఎవరూ లేరు. దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దాం” అంటూ తన మనసులోని బాధను, భావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

జీవిత భాగస్వామి లేకుండా.. ఒంటరిగా జీవించడం చాలా కష్టమని.. అయినప్పటికి.. ముందుకు సాగాల్సిందేనని ఆమె తెలిపారు. ఒంటరిగా ఉండటం వల్ల ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక పోతే.. ఎన్ని కష్టాలు ఎదురైనా, జీవితంలో ఏనాడు అబద్దం చెప్పవద్దనే విషయాన్ని తన తల్లి చిన్నప్పుడే తనకు నేర్పించిందని, దాన్ని ఇప్పటికి అనుసరిస్తున్నట్లు చెప్పారు. తన కుమారుడు అకీరా, తాను ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -