Sunday, April 28, 2024
- Advertisement -

పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్…… కొత్త సినిమా డైరెక్టర్, డిటెయిల్స్ ఇవే

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ నుంచి వచ్చే ఏ న్యూస్ అయినా ఆయన అభిమానులకు అమితానందాన్ని ఇస్తుంది. ఇప్పుడు పవన్ అభిమానులకు ఓ సూపర్ న్యూస్ వచ్చింది. అజ్ఙాతవాసి సినిమా తర్వాత సినిమాలకు పవన్ గుడ్ బై చెప్పేస్తాడేమో అని ఆందోళన చెందుతున్న అభిమానులకు ఈ వార్త ఆనందం కలిగించేదే. సీమాంధ్ర తెలంగాణాలలో పవన్ కళ్యాణ్ రెండు మూడు రోజుల షో చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజలందరూ కూడా సమస్యలను ఎదుర్కుంటున్నారని ఓ వైపు చెప్తూ…….. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖరరావు అద్భుతంగా పరిపాలిస్తున్నాడని భజన చేయడంతో పాలిటిక్స్‌లో మాత్రం కేవలం భజన స్టార్‌గా మిగిలిపోయాడు పవన్. అందుకే ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రజల మధ్యలో ఉంటే …..ప్రభుత్వాలను విమర్శించకుండా ఉంటే ప్రజలు తిరగబడతారేమో, విమర్శలు తీవ్రతరమవుతాయేమోనన్న ఉద్ధేశ్యంతో ఈ గ్యాప్‌లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పవన్. చంద్రబాబు, కెసీఆర్‌లతో తెరవెనుక రాజకీయ ఒప్పందాల నేపథ్యంలో వాళ్ళిద్దరినీ విమర్శించకూడదు పవన్. అందుకే ప్రభుత్వాలను పొగుడుతూ ప్రజల కష్టాల గురించి మాట్లాడితే విమర్శలు, సెటైర్స్ భారీగా ఫడుతూ ఉండడంతో ప్రస్తుతానికి పొలిటికల్ షోకు బ్రేక్ ఇచ్చాడు పవన్.

అయితే రియల్ లైఫ్ పాలిటిక్స్‌లో కమెడియన్ అవుతున్న పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్‌లో మాత్రం పాలిటిక్స్ ఇరగదీయనున్నాడు. త్రివిక్రమ్ లాంటి టాప్ రేంజ్ డైరెక్టర్‌తో తీసిన అజ్ఙాతవాసి సినిమా డిజాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సారి తన స్టైల్‌లోనే చిన్న డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో వెళ్ళనున్నాడు పవన్. ఆ డైరెక్టర్‌కి అన్ని డైరెక్షన్స్ పవనే ఇవ్వనున్నాడు. గబ్బర్‌సింగ్ తరహాలో మాస్ కామెడీ ఉండడంతో పాటు స్క్రీన్ పైన అధికారంలో ఉన్నవాళ్ళను ఎదిరించి సామాన్య ప్రజలకు ఎలా మేలు చేశాడన్న విషయం నేపథ్యంగా ఫుల్ కామెడీతో ఈ సబ్జెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. రియల్ లైఫ్ పొలిటికల్ షోలో కమెడియన్ అనిపించుకుంటున్న పవన్…….రీల్ లైఫ్‌ పొలిటికల్ షో హీరోయిజం ఎలా ఉంటుందో చూడాలి మరి. పోలిటికల్ పంచ్‌లు మాత్రం ఈ సినిమాలో భారీగా పేలే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -