2014లో రాష్ట్ర విభజనతో అన్నీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని అనాథలా చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులకు బిగ్గెస్ట్ షాక్ ఇచ్చే డెసిషన్ తీసుకోనున్నాడు జగన్. హోదాలాంటి కేంద్ర హామీలు, రుణమాఫీల్లాంటి బాబు హామీలతో సహా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ని ఈ మూడున్నరేళ్ళ కాలంలో పూర్తిగా దగా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో నాదీ-మోడీది అభివృద్ధి జోడీ అన్న చంద్రబాబు రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో పాటు సమాన పాపం పంచుకున్న బిజెపికి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల చేత ఓట్లేయించాడు. ఇక భజన సేనుడు పవన్ కూడా చంద్రబాబు, నరేంద్రమోడీల తరపున వకాల్తా పుచ్చుకుని……. వాళ్ళ హామీలకు నాదీ పూచి అని నమ్మబలికాడు. అధికారంలోకి వచ్చాక ఓటర్లను బోడి మల్లన్నలను చేస్తూ ముగ్గురూ కూడా వంచించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన చివరి బడ్జెట్‌లో కూడా ఎపికి చిప్పే గతి అయిన నేపథ్యంలో కూడా చంద్రబాబు పూర్తిగా మౌనంగా ఉన్నాడు. ఆయన భజన మీడియాలో మాత్రం షరా మామూలుగానే బాబు రంకెలు, బాబు అగ్రహోదగ్రుడయ్యాడు, ఆవేశంతో ఎగిరెగిరిపడుతున్నాడు అంటూ పచ్చ ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టటం కంటే ముందే మోడీని కలిసి ఆంధ్రప్రదేశ్‌కి బడ్జెట్ కేటాయింపులు మీ ఇష్టం…..అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు అని మోడీకి చెప్పాడన్న వార్తలు ఢిల్లీలో హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా అమిత్ షా కూడా 2019 ఎన్నికల్లోనూ టిడిపితోనే పొత్తు ఉంటుందని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల్లో చంద్రబాబు, మోడీలకే సపోర్ట్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళ రాజకీయ వ్యూహాలను ఎదుర్కునేందుకు బిగ్గెస్ట్ స్టెప్ తీసుకోనున్నాడు జగన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన వెంటనే …….ఆ బడ్జెట్ కూడా ప్రజలను వంచించేలా ఉంటే మాత్రం వెంటనే తన పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేల మొత్తం చేత రాజీనామా చేయించనున్నాడు జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వంచిస్తున్నందుకు అసెంబ్లీ, పార్లమెంట్‌లకు రాజీనామా చేస్తున్నామని చెప్పి వైకాపా ఎంపిలు, ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయనున్నారు. 2014 నుంచి మోడీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా వంచిస్తున్నాడో ప్రజలకే వివరిస్తూ ప్రజా క్షేత్రంలోనే మోడీ, చంద్రబాబులను ఎదుర్కోనున్నాడు జగన్. పాలన చివరిదశలో అధికారం ఉన్నప్పటికీ కేసులతో సహా ఏ విషయంలోనైనా ఇబ్బందిపెట్టడానికి రెడీ అయినా కూడా ప్రజా బలంతోనే ఎదుర్కోవాలని చూస్తున్నాడు జగన్. సోనియాగాంధీని ఎదిరించడంతో సహా ఇప్పటికే ఎన్నో బోల్డ్ స్టెప్ తీసుకున్న జగన్…….ఈ సారి మాత్రం అసెంబ్లీ, పార్లమెంట్‌లు షేక్ అయ్యే స్థాయిలో…….దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా ఈ బిగ్గెస్ట్ స్టెప్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు జగన్. పాదయాత్రతో ప్రజా బలం కూడా భారీగా పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా తనకు అండగా నిలుస్తారన్న నమ్మకంతో ఉన్నాడు జగన్. ప్రస్తుతం జాతీయ సర్వేలతో పాటు లగడపాటి లాంటి వాళ్ళ సర్వేల్లో కూడా మోడీ, చంద్రబాబు, పవన్‌ల ముగ్గురి కంటే కూడా జగన్‌కే ఎక్కువ ప్రజాదరణ ఉందని చెప్తున్న విషయం తెలిసిందే.
