Monday, May 20, 2024
- Advertisement -

ఎపి ప్రజలు హృదయవిదారకంగా రోదిస్తున్నా పచ్చ మీడియాకు మాత్రం రాజకీయమే కావాలా?

- Advertisement -

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగింది. 2014 తర్వాత నుంచీ అంతకంటే దారుణమైన అన్యాయం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి పౌరుడూ కూడా మౌనంగా రోదిస్తున్న పరిస్థితి. ఆ రోదన ఉద్యమంగా ఎప్పుడో రూపుదిద్దుకుని ఉండేదే…….. కానీ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్న చంద్రబాబు….బాబు బాకా ఊదుతున్న పచ్చ మీడియా ప్రజల ఆవేశానికి సంకెళ్ళు వేయడంలో మాత్రం ప్రతిసారీ సక్సెస్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి సంజీవని లాంటి ప్రత్యక హోదా కోసం ప్రతిపక్ష పార్టీతో సహా, కమ్యూనిస్టులు, సాధారణ ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేశారు. జాతీయ స్థాయి మీడియాలో కూడా హోదా ఉద్యమం గురించి ప్రముఖంగా వార్తలు వచ్చేలా చేశారు. అలాంటి సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, ఆయన భజన మీడియా కూడా హోదా ఉద్యమానికి కనీసం ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు నరేంద్రమోడీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండేవాడు కాదు. కానీ చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ అంతా కూడా హోదా ఉద్యమం ఫ్లాప్, అట్టర్‌ఫ్లాప్ అని ప్రచారం చేసి……..144సెక్షన్స్ విధించి, కేసుల పెట్టించి యువత ఆవేశాన్ని, ఉద్యమాన్ని పూర్తిగా అణచేశారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్‌కి తీవ్రమైన ద్రోహం చేశారు.

తాజాగా చివరి బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్‌కి అన్ని విధాలా అన్యాయం చేశాడు మోడీ. అయినప్పటికీ బడ్జెట్ ప్రసంగం అయిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌పై ప్రశంశలు కురిపించాడు. అదీ టిడిపికి మోడీ అంటే ఉన్న భయం. కానీ పచ్చ మీడియా మొత్తం కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఆవేధన వ్యక్తం చేశాడు అంటూ కొన్ని పడికట్టు పదాలతో మూడేళ్ళుగా మోసం చేస్తున్నట్టుగానే మరోసారి మోసపు వార్తలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఆ వీరాధివీరుడు చంద్రబాబుకు మాత్రం నరేంద్రమోడీని కనీసం డిమాండ్ చేసే ధైర్యం కూడా లేదు. బడ్జెట్‌పై ఇప్పటి వరకూ కనీసం స్పందించే సాహసం చేయలేదు. మీడియా ముందుకు వస్తే ఎక్కడ మోడీని పొగడాల్సి వస్తుందో అని పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. పచ్చ మీడియా చేత మాత్రం అగ్రహోదగ్రుడవుతున్న చంద్రబాబు అని వార్తలు రాయించుకుంటున్నారు.

వ్యక్తిగత స్వార్థం కోసం……….కచ్చితంగా వ్యక్తిగత స్వార్థమే……..ఎందుకంటే నాలుగేళ్ళుగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి చేసింది ఏమీ లేదు……..చివరి బడ్జెట్ కూడా అయిపోయిన నేపథ్యంలో ఇక చేయడానికి కూడా ఏమీ లేదు…….అందుకే చంద్రబాబుది కచ్చితంగా వ్యక్తిగత స్వార్థం అని చెప్పొచ్చు. వ్యక్తిగత స్వార్థం కోసం విభజనతో అన్నీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత కీలకమైన ఐదేళ్ళ కాలాన్ని ఫణంగా పెట్టేశాడు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌కి తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతున్నాపచ్చ మీడియా జనాలందరూ కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం భజన చేసుకుంటూ కూర్చున్నారు. వీళ్ళందరి వైఖరిపై 2019ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది. ఎన్నికలలోపే మోడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామన్నా…….కనీసం ఆందోళన చేస్తామన్నా కూడా అరెస్ట్ చేయిస్తా అని చంద్రబాబు అనడం ఖాయం కాబట్టి…..ఐదేళ్ళుగా జరుగుతున్న అన్యాయంపై స్పందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సరైన సమయం 2019ఎన్నికలే. ఆంధ్రప్రదేశ్ ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -