Saturday, May 18, 2024
- Advertisement -

ప‌వ‌న్ లిటిల్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

- Advertisement -

బుడ్డోడి పాట‌తో అనందంలో ప‌వ‌ర్‌స్టార్‌

‘కొడకా కోటేశ్వరరావు’ పాట యూట్యూబ్‌లో వారం రోజులుగా ట్రెండింగ్‌గా ఉంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ న‌టించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతోంది. ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ పాట‌ను ఓ పొలాండ్ బుడ్డోడు పాడి ప‌వ‌న్‌ను ఆక‌ట్టుకున్నాడు.

‘కొడకా కోటేశ్వరరావు’ పాట పాడి పవన్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘హే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పాట పాడి విడుద‌ల చేశారు. నా స్టైల్‌లో ఈ పాట పాడి నేను మీకు ఇస్తు కానుక ఇది.’ అంటూ పవన్‌కు ట్వీట్‌ చేశాడు. అది చూసిన పవన్ స్పందించాడు. ‘మై డియర్‌ లిటిల్‌ ఫ్రెండ్‌..ఈ కొత్త కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీ సందేశం నాకు అందింది. గాడ్‌ బ్లెస్‌యూ’ అని ట్వీట్‌ చేశారు.

ఇందుకు ఆ బాలుడు..‘ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. థాంక్యూ పవర్‌స్టార్‌. లవ్యూ పవర్ స్టార్’ అని ట్వీట్‌ చేశాడు. ఈ బాలుడు ఇంత‌కుముందు హ‌లో, ఎస్వీఆర్ డైలాగ్‌లు త‌దిత‌ర తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను త‌న‌దైన శైలిలో పాడుతూ యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తున్నాడు. ప్ర‌స్తుతం కొడ‌కా కోటేశ్వ‌రరావు పాట పాడి ఆక‌ట్టుకున్నాడు. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌పై అభిమానంతో ఓ పాట పాడ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. జ‌న‌వ‌రి 9వ తేదీన విడుద‌ల చేస్తాడంట‌.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా వ‌స్తోంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -