Sunday, May 19, 2024
- Advertisement -

ప్ర‌జ‌ల‌పై భారం వేసిన హైకోర్టు

- Advertisement -

సినిమా టికెట్ల ధ‌ర పెంపున‌కు అంగీకారం

తెలుగు ప్ర‌జ‌ల‌పై ఉమ్మ‌డి హైకోర్టు భారం వేసింది. సినిమా ధ‌ర‌లు పెంచుకోవ‌చ్చ‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. సినిమా థియేటర్ టికెట్ ధరలు పెంచుకోవ‌చ్చ‌ని సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపింది.

టికెట్ ధరలు పెంచాలంటూ కొందరు సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం టికెట్ ధరల పెంపు విషయంలో నిర్ణయం తీసుకోలేదని.. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోందని.. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు పిటీష‌న్‌లో కోరారు. దీనిపై స్పందించిన ఉమ్మడి హైకోర్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల్ని పెంచుకోవటానికి వీలుగా అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. అదే సమయంలో అన్ని తరగతుల ప్రతిపాదిత టికెట్ల ధరల సమాచారాన్ని సంబంధిత అధికారుల‌కు ఇవ్వాలని స్పష్టం చేసింది.

పెంచిన టికెట్ ధరలకు తగ్గట్లే.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించాలని పేర్కొంది. తాము ఇచ్చిన మార్గదర్శకాలు అమలవుతున్నాయో లేదో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని.. దీనిపై నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

రాబోయే సంక్రాంతి సీజన్లో టికెట్ల ధరలను ప్రస్తుతం ఉన్న మొత్తానికన్నా ఎక్కువ చేసుకునేందుకు అనుమతివ్వాలని ఏపీ, తెలంగాణలోని కొన్ని థియేటర్లు వేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిశీలించి ధరలను పెంచుకోవచ్చంటూ అనుమతిచ్చింది. సీజన్లో వచ్చే సినిమాల ప్రదర్శనకు ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వస్తోందని, అందుకే ధరల పెంపు కోరుతున్నట్లు థియేటర్ యాజమాన్యాలు తెలిపాయి.

దీని విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులనే మళ్ళీ జారీ చేశాయి. క్రితంసారి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులనే ఈసారి సంక్రాంతికి కూడా వర్తింపజేశారు. అంతేగాక పెంచిన టికెట్ల ధరలను అధికారులకు తెలపాలని, పెంచిన ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని యాజమాన్యాలకు సూచించాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -