Thursday, May 9, 2024
- Advertisement -

లోక్ స‌త్తా పార్టీ దిశ‌గా జ‌న‌సేన వెళ్తోందా…?

- Advertisement -

ప్ర‌శ్నించ‌డానికి నేను వ‌స్తున్నా…అంటూ జ‌న‌సేన పార్టీని స్థాపించారు ప‌వ‌న్ . అయితే ఎవ‌రిని ప్ర‌శ్నిస్తున్నారో ఆయ‌నకు అర్థం కావ‌డంలేదు. ఎప్పుడు చూసినా నా కో లెక్కుంది అంటంటాడు…ఆ లెక్క ఏంటో ఎవ‌రికి అర్థం కావ‌డంలేదు. పార్టీ పెట్టిన త‌ర్వాత ప్ర‌జ‌ల తరుపున అధికార ప‌క్షాల‌ను ప్ర‌శ్నించ‌డం సాధార‌నం. కాని జ‌న‌సేన మాత్రం ప్ర‌జ‌ల‌ను, ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నిస్తుంటారు.

అయితే ప్ర‌స్తుతం జ‌న‌సే పార్టీ స్వ‌చ్ఛంద సంస్థ‌గా మారుతుందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌భుత్వాలు బాగా ప‌ని చేస్తున్న‌ప్పుడు పార్టీ పెట్ట‌డం ఎందుకు. గ‌తంలో జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ లోక్‌స‌త్తా పార్టీని పెట్టి రాజ‌కీయంగ విఫ‌లం అయి స్వ‌చ్ఛంద సంస్థ‌గా మారిపోయిన తీరుగానే జ‌న‌సేన కూడా అలా మారిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రాజకీయాలకుసంబంధించి. కేసీఆర్ పాలన బాగుందని, చంద్రబాబు పాలన బాగుందని చెప్పటంద్వారా పవన్ తెలుగు రాష్ట్రాలప్రజలకు… కనీసం తన పార్టీ కార్యకర్తలకైనా ఏమి సందేశం ఇస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరువురు చంద్రుల పాలన బాగుంటే జనసేన అవసరం ఏమిటన్న విమర్శ బలంగా వినబడుతోంది.

కేసీఆర్ పాలన బాగుందని, ఆయన ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ అద్భుతమని పొగడటం ద్వారా పవన్ తన అపరిపక్వతను మరోసారి బయటపెట్టుకున్నాడు. ప్రభుత్వాలు రూపొందించే పథకాలు ఏవైనా ఒక మంచి, ఉన్నతలక్ష్యంతో, ఉద్దేశ్యంతోనే రూపొందుతాయి. కాని అవి ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌నేది అంతిమ ల‌క్ష్యం.

తెలంగాణలో నిరంతరవిద్యుత్ అనే పథకం ఇటీవలే మొదలుపెట్టారు. దానిలో మంచి-చెడులు, లాభనష్టాలు, లోతుపాతులు అప్పుడే తెలియవు. దానిని అధ్యయనం చేయకుండానే పైపైన చూసి అద్భుతమని ప్రశంసించటం తొందరపాటు. నిరంతర విద్యుత్ వలన భూగర్భజలాలు అడుగంటే ప్రమాదముందని, నాణ్యమైన విద్యుత్ 9 గంటలు ఇచ్చినా చాలని వివిధ వాదనలు వినబడుతున్నాయి.

నిరంత విద్యుత్‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు . కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఉద‌య్ ప‌థ‌కం ద్వారానే 24 గంట‌ల విద్యుత్ సాధ్య‌మ‌య్యింద‌ని…ఇంకో వైపు క‌రెంటు కొనుగోల్ల‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కాంగ్రెస్-కోదండరామ్ మరోపక్కన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సంయంలో ప‌వ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంతో అభిమానులు, సానుభూతి ప‌రులు అంద‌రూ అయోమ‌యంలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -