సర్దార్ హిట్టా..ఫ్లాపా అంటూ జనం. మాట్లాడుకుంటూండగానే ఆయన తన తుదపరి చిత్రాన్ని సిద్దం చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఏప్రియల్ 29 నుంచి ఆ చిత్రం మొదలు కానుంది. ఆ రోజునే అఫీషియల్ గా లాంచ్ చేస్తారు.
ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించి రెండు పాటలు రికార్డింగ్ సైతం అనూప్ రూబెన్స్ పూర్తి చేసారు. అంటే ఈ సంవత్సరమే పవన్ మరో సినిమాని రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ఈ సినిమా టాక్ కూడా ఈ కొత్త చిత్రం స్పీడు పెంచటానికి కారణం అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ విషయానికి వ స్తే… ఫ్లాఫ్ టాక్ వచ్చిన ప్పటికీ తొలి రోజు ఓ రేంజిలో ఓపినింగ్స్ రావటం డిస్ట్రిబ్యూటర్స్ కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.
తమ పెట్టుబడిలో అరవై శాతం వరకూ రికవరీ అయ్యే అవకాసం ఉందని లెక్కలు వేస్తున్నారు. పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను అలరించటం కలిసి వచ్చే అంశం. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలు, బాలీవుడ్ లో 2 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.
