Wednesday, May 15, 2024
- Advertisement -

సర్దార్ ఆడియో టీజర్ అద్భుతంగా ఉంది

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియోని ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు. అయితే అభిమానులు సినిమా గురించే ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ సినిమా టీజర్ కోసం కూడా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజునుండే ఇంచుమించి అన్ని రకల ప్రమోషన్స్ ప్రారంభం అవుతున్నాయి.

అందులో భాగంగనే ముందుగా టీజర్, తరువాత ఆడియో ట్రాక్స్, మెదలైన విడియో ప్రమెషన్స్ అన్ని కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి. చాలా వేగంగా దూసుకేల్తున్నాయి ఈ సినిమా వర్క్స్. ఆడియో వేడుక కూడా చాలా పెద్ద మొత్తంలో రిలీజ్ చేయనున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే టీజర్ నిండా ఒక్క డైలాగ్ కూడా లేకున్న తన స్టైల్‍తో అదరగొట్టాడు పవన్.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ హల చల్ చేస్తుంది. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అభిమానులకు సమ్మర్ ట్రీట్‌గా నిలుస్తుందని నిర్మాత శరత్ మరార్ నమ్మకం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పవన్ సరసన తొలి సారిగా కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 {youtube}v=bUZfER6-dLA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -