Thursday, May 9, 2024
- Advertisement -

చిరు ‘సైరా’ షూటింగ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ళ్లుక్కున మెరిశారు.త‌న అన్న‌య్య చిరంజీవి న‌టిస్తున్న సినిమా షూటింగ్ ఎలా జ‌రుగుతుందో అని చూడాటానికి వెళ్లారు ప‌వ‌న్‌. చిరంజీవి పుట్టిన రోజు త‌రువాతే ప‌వ‌న్ సైరా షూటింగ్‌కు వెళ్లార‌ని ఇట్టే అర్థం అవుతుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్‌తో ద‌ర్శ‌నం ఇచ్చాడు.

చిరంజీవి పుట్టిన రోజున ప‌వ‌న్ ఫుల్ గెడ్డంతో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.ఇక షూటింగ్ స్పాట్‌లో ఉన్న బిగ్‌బి అమితాబ్‌తో క‌లిసి ఫోటో దిగారు చిరు ,ప‌వ‌న్‌. ఈ ఫోటోలో చిత్ర నిర్మాత హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా ఉండటం విశేషం.స్వాంత‌త్య్రోద్య‌మ కారుడైన ఊయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత క‌థ‌ను సైరా మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది .అమితాబ్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి,సుదీప్‌,జ‌గ‌ప‌తి బాబు,త‌మ‌న్నాలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సినిమాను వ‌చ్చే వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -