Saturday, May 4, 2024
- Advertisement -

బాబు బ్యాచ్ జనాలందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన ‘డే’ ఈ రోజే

- Advertisement -

ఫాదర్స్, మదర్స్ డే లాంటి డేలను కొందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో…….. అలాగే ఈ రోజును మాత్రం చంద్రబాబుతో సహా ఆయన అభిమానులు, ఆయన భజన మీడియా సభ్యులందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. తన రెండో భార్య లక్ష్మీపార్వతితో కలిసి నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచార సభలు నిర్వహించి రికార్డ్ స్థాయిలో……. ఎవ్వరూ ఊహించని విధంగా 247 స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు గద్దెనెక్కిన రోజు ఇదే మరి. నంబర్ ఒన్ పత్రిక అని చెప్పుకునే ఒక మీడియాధిపతి, ఓపెన్ హార్ట్ సర్జన్ జర్నలిస్టులు ఈ వెన్నుపోటు ఎపిసోడ్ మొత్తాన్ని మహత్కార్యంగా నాటి ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. అందుకోసం జర్నలిజం విలువలను పాతరేశారు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల రొమాన్స్ అంటూ కార్టూన్స్ వేశారు. ఎన్టీఆర్‌ని దిగంబరుడిగా చూపిస్తూ కామెడీ చేశారు. ఆత్మక్షోభకు గురిచేశారు.

అవినీతి, అక్రమాలకు ఎన్టీఆర్ ఒప్పుకోవడం లేదన్న దుగ్ధతో చంద్రబాబు, నంబర్ ఒన్ పత్రిక అధినేత, ఓపెన్ హార్ట్ సర్జన్‌లు ఈ చర్యకు దిగితే………..కుటుంబ సభ్యులను అధికారంలో భాగస్వాములను చేయడం లేదన్న కోపంతో బాలకృష్ణలాంటి వాళ్ళు నాడు పూర్తిగా వెన్నుపోటు ఎపిసోడ్‌కి పూర్తిగా సహకరించారు. మేరునగధీరుడు, చారిత్రక పురుషుడు, అవతార పురుషుడు అని ఇప్పుడు ఎన్టీఆర్ భజన చేస్తూ ఆయన పేరు చెప్పుకుని ఇప్పటికీ ఓట్లు కొల్లగొడుతున్న వాళ్ళే నాడు ఇదే రోజు ఎన్టీఆర్‌ మానసికంగా చనిపోవడానికి కారణమయ్యారు. అదే విషయాన్ని ఎన్టీఆర్ కూడా దశమగ్రహం అంటూ ఆవేధనగా ప్రజలతో పంచుకున్నాడు. కానీ అధికారం, అవినీతికి అలవాటు పడ్డ భజన మీడియా సాయంతో ఎన్టీఆర్ ఆవేదన ప్రజల్లోకి వెళ్ళకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. అయితే ఈ మొత్తం కుట్రకు లక్ష్మీపార్వతిని బూచీగా చూపించాడు చంద్రబాబు. కానీ ఎన్నికలకు ముందే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య. ఎన్టీఆర్‌తో పాటు ఎన్నికల సభలు అన్నింటిలో ప్రచారం చేసింది. ప్రజలు ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతిని ఒప్పుకున్నారు. ఎన్టీఆర్‌కి పట్టం కట్టారు. అయినప్పటికీ లక్ష్మీపార్వతిని బూచీగా చూపించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌కి వ్యూహరచన చేసిన ఓ పత్రికా మేధావి అవినీతి, అక్రమాలకు ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడమే అసలు కారణం అని నేటీకి సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఎన్టీఆర్ పతనరచన గొప్పగా చేసిన జనాలందరూ ఈ రోజు అనుకున్న లక్ష్యాలన్నీ సాధించి ఉండడం మాత్రం ఎన్టీఆర్ అభిమానుల ఆవేదన పెంచే విషయమే. ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు చెప్పుకునే ఓట్లు కొల్లగొడుతూ అధికారాన్ని అనుభవిస్తూ ఉండడం మాత్రం ఎన్టీఆర్ ఆత్మకు కూడా ఆవేధన కలిగించే విషయమే అని విశ్లేషకులు చెప్తూ ఉండడం విషయ తీవ్రతను తెలియచేస్తోంది. ఒక వెన్నుపోటు కుట్ర, ఒక పాపాన్ని పుణ్యంగా మార్చడంలో సక్సెస్ అయిన అదే మీడియా జనాలు ఈ రోజుకీ కూడా సామాన్యులను వాళ్ళ వార్తా కథలతో ఏమారుస్తూ ఉండడం అసలైన విషాదం అని చెప్పడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -