Friday, May 3, 2024
- Advertisement -

తప్పతాగి.. ట్యాక్సీలో మూడు దేశాల్లో తిరిగి…?

- Advertisement -

కొత్త ఏడాది సెలబ్రేషన్లో భాగంగా ఓ వ్యక్తి తప్పతాగి చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన ఇంటికి వెళ్లడానికి ఒకతను ట్యాక్సీ బుక్ చేశాడు. ఏకంగా మూడు దేశాలగుండా ఆ ప్రయాణం సాగింది. ఎలాగోలా చివరికి గమ్యస్థానానికి చేరుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగడంతో… తాగిన మత్తులో ఉన్న వ్యక్తి డబ్బులేంటని ప్రశ్నించడంతో షాక్ కు గురవ్వడం డ్రైవర్ వంతైంది. విషయంలోకి వెళితే…. 40 ఏళ్ల నార్వేకి చెందిన ఓ వ్యక్తి డెన్మార్క్ లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం తాగిన మత్తులో క్యాబ్ ను బుక్ చేశాడు. డెన్మార్క్ లోని కొపెన్ హెగెన్ నుంచి స్వీడన్ మీదుగా చివరికి నార్వే రాజధాని ఓస్లో వరకు 600కిలో మీటర్లు 6 గంటలపాటూ క్యాబ్ లో ప్రయాణించాడు. ఇంటికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు డ్రైవర్ కు డబ్బు ఇవ్వకుండానే వెళ్లి ఇంట్లో పడుకున్నాడు.

ఓ వైపు దేశం కాని దేశం అందులోనూ కారు బ్యాటరీ కూడా పనిచేయడం ఆగిపోయింది. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్ ఓస్లో పోలీసులకు ఫోన్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పోలీసులు నిద్రలేపి ఎలాగోలా కారు కిరాయి డబ్బులు 18,000 నార్వేన్ క్రోన్ చెల్లించేలా ఒప్పించారు. అతడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోవడంతో పోలీసులు కూడా ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

కారుకు మరమ్మతులు చేపించడంలో సహాయం కోసం ట్యాక్సీ డ్రైవర్కు ఓ రికవరీ వాహనాన్ని పోలీసులు పంపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను నార్వే పోలీసులు తమ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో సరదాగా పోస్ట్ చేశారు. క్యాబ్ కిరాయికి కట్టిన డబ్బుకు ఇంకా కొద్ది డబ్బు కడితే ఓ కొత్త కారు కొనొచ్చు కదా.. అని కొందరు… అదే డబ్బుతో విమానంలోనైతే కొపెన్ హెగెన్ నుంచి ఓస్లోకు ఓ రెండు రౌండ్లు వెయ్యోచ్చని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -