Sunday, May 19, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు నిజం తెలుసు మాధ‌వీ ల‌త సంచ‌ల‌న కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్‌ను ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వెంటాడుతున్నది. శ్రీరెడ్డి ఉదంతం సినీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శ్రీరెడ్డి ఘటనపై మాధవీలత స్పందిస్తూ.. తాను కూడా అనేక అవమానాలకు గురయ్యానని చెప్పారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తోపాటు, సోషల్ మీడియాలో మాధవీలత తన అనుభవాలను పంచుకొన్నారు. తాజ‌గా ప‌వ‌న్ గురించి ట్విట్ట‌ర్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై పవన్ కల్యాణ్ కు నిజం తెలుసునని నటి మాధవీ లత వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ తెలిసీ స్పందించని ఆయన, ఇప్పుడు తప్పదన్న పరిస్థితుల్లోనే స్పందించారని చెప్పింది. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, “పవన్ కల్యాణ్ కు నిజం తెలుసు. ఇన్నాళ్లూ స్పందించలేదు. ఇప్పుడు కూడా తప్పదు కనుక ఈ విషయంలో నోరు విప్పారు. చాలా త్వరలో పవన్ కల్యాణ్ కు తెలిసిన నిజం ఏంటో బయటకు వస్తుంది. వెయిట్ అండ్ సీ ది గేమ్. నేను కూడా నిజం కోసం ఎదురు చూస్తున్నాను. ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజం… పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ స్పందించక పోవడానికి వెనుక ఉన్న నిజం… ఏంటి ఫ్యాన్స్… మీకే చెబుతున్నా… పవన్ కల్యాణ్ మీరు అనుకునేంత తెలివి తక్కువ పర్సన్ కాదు. ఇవాళ స్పందన తప్పదు కనుక చెప్పారు. అతి త్వరలోనే నిప్పులాంటి నిజాలు వస్తాయ్… నేను ఎదురు చూస్తున్నా” అని చెప్పుకొచ్చింది. మ‌రి ప‌వ‌న్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -