Wednesday, May 7, 2025
- Advertisement -

పవన్ మళ్లీ ఆ తప్పే చేస్తున్నాడా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే ఎస్ జే సూర్య దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టి ఆ సినిమాని మధ్యలో ఆపేసిన విషయం తెలిసిందే. సూర్యకి మహేష్ సినిమాలో నటించే చాన్స్ రావడంతో ఈ చిత్రంను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఎస్ జే సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలోకి డాలీ వచ్చాడు.

డాలీ డైరెక్షన్ లో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో పవన్ కనిపించిన విషయం తెలిసిందే. డాలీ కూడా పవన్ తో సినిమా చేయాలి అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. పవన్ నుంచి పిలుపు రావడంతో వెంటనే సరే అన్నాడు. అయితే డాలీ దర్శకత్వంలో పవన్ చేయబోతున్న చిత్రం ఇటివలే మొదలు అయ్యింది. అయితే ఈ చిత్ర కథకు సంబంధించి స్క్రీన్ ప్లేను పవనే అందించనున్నాడట.

కాకపోతే పవన్ తన పేరు వేసుకోడట. పవన్ కథ, స్క్రీన్ ప్లే అందించిన జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు రాబోయే సినిమాకి పవన్ స్క్రీన్ ప్లే అందిస్తుడటంతో పవన్ ఫ్యాన్స్ బయపడుతున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ను ఈ నెల 29 న మొదలు పెట్టి ఏకదాటిగా వచ్చే నేల 18 వరకు షూట్ చేయనున్నారట. ఇక ఈ చిత్రంను శరత్ మారార్ నిర్మిస్తున్నారు. పవన్ మళ్లీ స్క్రీన్ ప్లే విషయంలో జ్యోకం చేసుకోవడంతో ఈ సినిమా హిట్ అవుతుందో లేక జానీ, సర్దార్ సినిమాలాగే ప్లాప్ అవుతోందో అని ఫ్యాన్స్ బయపడుతున్నారు.

{youtube}qzeWP63Rz0g{/youtube}

Related

  1. పవన్ కళ్యాణ్ కొంప ముంచుతాడా ?
  2. మరో సారి పవన్ సరసన శృతీహాసన్
  3. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!
  4. పవన్ కళ్యాణ్ ఎందుకూ పనికి రాడు- లక్ష్మీ పార్వతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -