Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!

- Advertisement -

పవర్ స్టార్ పుట్టిన రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిప్ట్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? టాలీవుడ్‌లో నంద‌మూరి, మెగా ఫ్యామిలీల‌కు చెందిన ఈ ఇద్ద‌రు హీరోల‌తో పాటు వీరి అభిమానులు కూడా భిన్న ధృవాలుగా ఉంటారు. అలాంటి ప‌వ‌న్ బ‌ర్త్‌డేకు ఎన్టీఆర్ గిఫ్ట్ ఇవ్వ‌డం ఏంటని మ‌నం ఒక్క‌సారిగా అవాక్క‌వ్వాల్సిందే.

అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జ‌న‌తా గ్యారేజ్ కోసం ప్రేక్షకులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జనతా గ్యారేజ్ ఆగ‌స్టు 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. కానీ నాణ్యమైన సినిమాని అందించడం కోసం మరో మూడు వారాల టైం పడుతుందని కొర‌టాల చెప్పారు. సో జ‌న‌తా గ్యారేజ్ సినిమాని సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం అని చిత్ర‌యూనిట్ అధికారికంగా తెలిపింది.

అదే రోజున ప‌వన్‌క‌ళ్యాణ్ బ‌ర్త్ డే కావ‌డం విశేషం. సో దీనిని బ‌ట్టి ఆ రోజు ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుక‌ల్లో ఉంటే ఎన్టీఆర్ గ్యారేజ్‌తో త‌న ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇవ్వ‌నున్నాడ‌న్న‌మాట‌. ఇక ఆగ‌స్టులో గ్యారేజ్‌ మూవీ ఆడియోను రిలీజ్ చేయ‌నున్నారు. గ్యారేజ్ రిలీజ్ డేట్ వాయిదా ప‌డ‌డంతో ఆగస్ట్ 12న బాబు బంగారం విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

Related

  1. షాకింగ్ : పవన్ కళ్యాణ్ తో సింగర్ సునీత
  2. పవన్ కళ్యాణ్ మీద కోపంగా ఉన్న అభిమానులు
  3. పవన్ గురించి ఆలీ ఏం అన్నాడంటే?
  4. పవన్ సారీ చెప్పేశాడు! ఎందుకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -