Saturday, May 18, 2024
- Advertisement -

హీరోలు మారితేనే సినిమాలు మారేవి

- Advertisement -

టాలీవుడ్ హీరోలంతా…. ఇంకా మూస ధోరణిలోనే ఉండిపోయారనేది డైరెక్టర్ క్రిష్ ప్రధాన ఆరోపణ .అందుకే మనవాళ్లు మారాలి,సినిమాలను మార్చాలంటున్నాడు.టాలీవుడ్లో ముందునుంచి  ప్రయోగాలు చేయాలంటే  అదో పెద్ద కష్టమైన పని .ముందునుంచి ప్రయోగాల బాట పట్టడానికి మనవాళ్లు కమర్శియల్ గా వర్కవుట్ కాదని సాహసించడం లేదు.

అయితే కాలంతో పాటు ప్రేక్షకుడి ఆలోచనలు కూడా మారతాయి కాబట్టి… ప్రయోగాలకు  మనోళ్లు పెద్ద పీట వేశారు.అయితే తెలుగులో క్రియేటివ్ దర్శకులంతా ప్రయోగాలు చేసిన వారే.ఒక విధంగా చెప్పాలంటే వారు మాత్రమే ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నారు.అలా చేయగా వచ్చిన చిత్రాలకు ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది.

టాలీవుడ్లో దర్శకులు సంగతెలా ఉన్నా…హీరోల సంగతి కేవలం కమర్శియల్ పంథాలోనే సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే..వారికి మార్కెట్ కంటిన్యూగా ఉండాలంటే వారు ఖచ్చితంగా కమర్శియల్ చిత్రాలనే టేకప్ చేయాల్సి ఉంటుంది. ఒక వేల పొరబాటున చేస్తే మాత్రం భారీ మూల్యాలను చెల్లించుకోక తప్పట్లేదు.మహేష్ టక్కరిదొంగ,వన్ చిత్రాలతో ఇదే ఇష్యూని ఫేస్ చేశాడు.ప్రభాస్ చక్రం,పవన్ జానిలతో ఈ ప్రాబ్లమ్ ను ఫేస్ చేసినవారే.అప్పటినుంచి మనకెందుకొచ్చిన గోలంటూ కామైపోయారు.

ఐతే  తాజాగా వచ్చిన మార్పు శుభసూచకమనే  చెప్పాలి.తెలుగు ఆడియన్స్ ఇచ్చిన సక్సెస్ లలో ప్రయోగాలు ఉన్నాయి.బాహుబలి,శ్రీమంతుడు,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి.ఈసినిమాలన్నీ విభిన్న పంధాలో మూవ్ అవుతూ బాక్సాఫీస్ దగ్గర భలే సక్సెస్ అయ్యాయి.నిజానికి ఈ చిత్రాలు రిలీజ్ వరకు డౌటే అనే అనుమానాలు రేకెత్తించాయి.కాని చివరి నిమిషంలో విజయ డంకా మోగించాయి.

 డైరెక్టర్ క్రిష్ చెప్పినట్లు…మన హీరోలు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయారని చెప్పడంలో ఎలాంటి అవాస్తవం లేదు.ఉన్నమాటే డైరెక్టర్ క్రిష్ చెప్పాడు.అక్కడితో ఊరుకోకుండా…శ్రీమంతుడు’ ఘన విజయంతో టాప్ హీరోల ఆలోచనా సరళిలో మార్పు వచ్చినట్లుగా తనకు అనిపిస్తున్నా ఆమార్పు ఎంత వరకు నిలబడుతుంది అన్న విషయంపై తనకు ఇంకా సందేహాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ విసిరాడు క్రిష్. ప్రస్తుతం తాను హ్యాండిల్  చేసిన కంచె చిత్రం గురించి అతను ఎంతో ధీమాతో ఉన్నాడు.బిటౌన్ క్రిటిక్స్ సైతం కంచె గురించి చాలా గొప్పగా  మాట్లాడుతూ ఉండడం చూస్తుంటే… కంచెతో క్రిష్ మరో వండర్ క్రియేట్ చేస్తాడని చెబుతున్నారు.

ఏది ఏమైనా మారుతున్న కాలానికి తగ్గట్టుగా హీరోలు కూడా మారి దర్శకులకు స్వేఛ్చ నిస్తే…సౌత్ నుంచి ధీటైన కథా చిత్రాలను తీసుకురావడంలో మనమే ముందుంటాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -