Sunday, May 19, 2024
- Advertisement -

హోట‌ల్ గ‌దిలో న‌టి ‘పాయ‌ల్’ మృతి

- Advertisement -

బెంగాల్ న‌టి పాయల్ చక్రవర్తి ఓ హోట‌ల్ గ‌దిలో మృతి చెందిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బెంగాల్‌లో పలు టీవీ షోల ద్వారా బాగా పాపుల‌ర్ అయిన పాయ‌ల్ త‌రువాత కాలంలో టీవీ సీరియ‌ల్స్‌తో పాటు కొన్ని సినిమాల‌లో కూడా న‌టిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది.పాయ‌ల్ గ‌త కొంత‌కాలంగా భ‌ర్తతో విడిపోయి త‌న కొడుకుతో విడిగా ఉంటోంది.పాయ‌ల్ మృతదేహం సిలిగురి అనే ప్రాంతంలో ఓ హోటల్ గదిలో లభ్యమైంది.

మంగళవారం ఆమె హోటల్ లో అద్దెకు దిగగా, బుధవారం సాయంత్రం మృతి చెందిందని తెలుస్తోంది. ఆమె ఉంటోన్న హోటల్ గదిని ఎన్ని సార్లు కొట్టినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మరణంతో సహనటులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.పాయ‌ల్ మ‌ర‌ణ వార్త తెలుసుకున్న ఆమె స‌హ‌న‌టులు షాక్ గురైయ్యారు. పాయ‌ల్ ఎలా చ‌నిపోయిందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -