Saturday, May 18, 2024
- Advertisement -

 ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగుతున్న మోత్కుప‌ల్లి.. ఎక్క‌డ‌నుంచంటే…?

- Advertisement -

టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ప్రకటన చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. 35 ఏళ్లుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆలేరు నియోజకవర్గ ప్రజలు తనను దీవించి శానసనభకు పంపాలని కోరారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపైనే మోత్కుపల్లి నర్సింహులు బహిరంగ విమర్శలు గుప్పించడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తనపై కుట్రలు పన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేశారని, చంద్రబాబు మాట మీద నిలబడరని ఆరోపించారు.అనేక సార్లు చంద్ర‌బాబును దుమ్మెత్తి పోశారు. ఒక‌డుగు ముందుకేసి చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాకూడదని తిరుమలకు వెళ్లి శ్రీవారికి మొక్కుకున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో స‌మావేశ‌మ‌యిన మోత్కుప‌ల్లి ఆ ఆపార్టీలో చ‌రుతున్న‌ట్లు ఊహాగానాలు వ‌చ్చిన సంగ‌తి తెసిందే. ఏ పార్టీలో చేర‌కుండా స్వ‌తంత్య్ర అభ్య‌ర్తిగా పోటీ చేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గెలుస్తే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి జలాలను సాధించి సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. యాద‌గిరి గుట్ట‌లో ఈనెల 17న ఆలేరు నియోజ‌క వ‌ర్గ అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఆ భేటీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు మోత్కుప‌ల్లి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -