Tuesday, April 30, 2024
- Advertisement -

రాజ్యాంగంలో ఆప‌ధ‌ర్మ సీఎం అనే ప్ర‌స్తావ‌నే లేదు…? ఆ ప‌దం ఎప్పుడు ప్రాచుర్యంలోకి వ‌చ్చిందంటే…?

- Advertisement -

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అసెంబ్లీనీ ర‌ద్దు చేసిన చేసిన కేసీఆర్ అప‌ధ్ధ‌ర్మ ముఖ్యమంత్రిగా కొన‌సాగుతున్నారు. అసెంనీ ర‌ద్దు చేసిన తీర్మానానికి ఆమోద ముద్ర వేసిన గ‌వ‌ర్న‌ర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ గవర్నర్ నరసింహన్ కోరడం… దానికి కేసీఆర్ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి.

అస‌లు రాజ్యాంగంలో అప‌ద్ధ‌ర్మ అనే ప‌దం ఉందా అంటే లేదంటున్నారు న్యాయ‌నిపుణులు. రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న లోక్ సభ కానీ, శాసనసభ కానీ కాలపరిమితి కంటే ముందుగానే రద్దయినప్పుడు… కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు అప్పటిదాకా ఉన్న ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ ఆపద్ధర్మంగా కొనసాగుతారు. మంత్రులు కూడా అదే విధంగా కొసాగుతారు.

అయితే అస‌క్తిక‌ర విష‌య‌మేమంటే ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రధాని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావనే లేద‌ని విషయాన్ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం రాజ్యాంగంలో లేనప్పటికీ, మన దేశంలో ఒక సంప్రదాయంగా వస్తోందని అంటున్నారు.

అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. . కేవలం కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు, రోజువారీ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. నామినేటెడ్ పదవుల భర్తీ, ఉన్నతాధికారుల బదిలీలు, భారీ ప్రాజెక్టుల ప్రకటన, బడ్జెట్ తయారీ, ఆర్డినెన్సుల జారీ లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోరాదు.

ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం అనేది ఎప్పుడు ప్రాచుర్యంలోకి వ‌చ్చిందంటే రెండో ప్ర‌పంచ‌యుద్ధం ముగిన త‌ర్వాత ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. యూకే ప్రధానిగా విన్ స్టన్ చర్చిల్ కొనసాగుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన చర్చిల్… తన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న యోచనతో, ఇంగ్లండ్ రాజుకు తన రాజీనామాను సమర్పించారు. ఆ మరుసటి రోజే ఇంగ్లండ్ రాజు చర్చిల్ ను పిలిచి, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్యనిర్వహణ బాధ్యతలను చూసుకోవాలని చెప్పారు. ఆ ప్రభుత్వానికి కేర్ టేకర్ గవర్నమెంట్ (ఆపద్ధర్మ ప్రభుత్వం)గా నామకరణం చేశారు. అప్పుడే ఆపద్ధర్మ ప్రభుత్వం అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -