Tuesday, May 14, 2024
- Advertisement -

ఒకేసారి ఇద్ద‌రితో రొమాన్స్‌ చేస్తున్న హ్యాట్ బ్యూటీ..!

- Advertisement -

పాయ‌ల్ రాజ్ పుత్ అస‌లు ఈ పేరుతో ఓ హీరోయిన్ ఉంద‌ని ఆర్ఎక్స్ 100 సినిమా ముందు వ‌ర‌కు ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు.ఆర్ఎక్స్ 100 సినిమా అమ్మ‌డు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు టాలీవుడ్ ఫిదా అయింది. సినిమాలో కంటెంట్ క‌న్నా పాయ‌ల్ రాజ్ పుత్ అందాలే ఎక్కువ హైలెట్ అయ్యాయి.ఈ సినిమా త‌రువాత పెద్ద హీరోల సినిమ‌ల‌లో ఛాన్స్‌లు వ‌స్తాయ‌ని భావించింది పాయ‌ల్‌.అయితే ఒక‌టి ,రెండు చిన్న సినిమాలు త‌ప్ప ఆమె పెద్ద సినిమాల‌లో అవ‌కాశాలు రాలేదు.తాజాగా ఆమెకు ఒకేసారి రెండు పెద్ద హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసింద‌ని తెలుస్తుంది.

మాస్ రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం అమ‌ర్ అక్భ‌ర్ అంటోని సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వ‌గానే విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తుంద‌ని స‌మాచారం.ఇక త్రివిక్ర‌మ్ ,బ‌న్నీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయ్యే సినిమాలో కూడా పాయ‌ల్‌ను తీసుకున్నార‌ని తెలుస్తుంది.ఈ రెండు సినిమాలు త‌న కెరీర్‌కు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి అని భావిస్తుంది పాయ‌ల్‌.తెలుగులో త‌న మొద‌ట సినిమాలోని అన్ని చూపించిన ఈ భామ త‌న త‌రువాత సినిమాల‌లో ఏం చూపిస్తుందో చూడాలి అంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -