Saturday, May 18, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీకి లైంగిక వేధింపులు

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు మొత్తం #మీటూ చూట్టునే తిరుగుతున్నారు.ఇండ‌స్ట్రీలో త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి కొంద‌రు మ‌హిళ‌లు బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.తాజాగా ఈ లిస్ట్‌లోకి మ‌రో భామ వ‌చ్చి చేరింది.ఆర్ఎక్స్ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే క్రేజ్ దక్కించుకుంది. యూత్ లో ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే  ఆర్ఎక్స్ సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడంతో ఆమెకి అన్నీ అటువంటి అవకాశాలే వస్తున్నాయ‌ని తెలిపింది ఈ భామ‌.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకి కాస్టింగ్ కౌచ్ మీకు కూడా ఎదురైందట కదా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా.. ”టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది. నటిగా నిరూపించుకున్న తరువాత కూడా ఈ కాస్టింగ్ కౌచ్ భూతం నన్ను వెంటాడడం బాధగా ఉంది.ఈ సంద‌ర్భంగా ఓ వ్య‌క్తి నన్ను నీకు పెద్ద హీరోల సినిమాల‌లో ఛాన్స్ ఇప్పిస్తాను మ‌రి నాకేంటీ అని అడిగాడు.దీంతో నేను షాక్ అయ్యాను.వెంట‌నే వాడి చెంప ప‌గ‌ల‌కొట్ట‌ల‌నేంత కోపం వ‌చ్చింది. ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకుని అక్క‌డి నుంచి వ‌చ్చేశాన‌ని తెలిపింది ఆర్ఎక్స్ బ్యూటీ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -