Thursday, May 2, 2024
- Advertisement -

హాట్ ఫోటోలతో మైమరపిస్తున్న ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ తన అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తునే ఉంటుంది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈమె ఆ తరువాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఈ మధ్యనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘సీత’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్లతో హంగామా చేస్తోంది.

తాజాగా పింక్ కలర్ డ్రెస్సులో పాయల్ రాజ్ పుత్ ఫోటో కి అందంగా పోజిచ్చింది. తను ఈ డ్రెస్ డ్రెస్సు తో ప్రేమలో ఉన్నానంటూ క్యాప్షన్ పెట్టి దాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా ఫాన్స్ తో పంచుకుంది. డ్రెస్ కంటే పాయల్ ఇంకా బాగుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా పాయల్ చేతిలో బాగానే ఆఫర్లు ఉన్నాయి. త్వరలో ఈమె వెంకటేష్ మరియు నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకీ మామ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవితేజ మరియు వీ ఐ ఆనంద్ ‘డిస్కో రాజా’ సినిమాలో కూడా పాయల్ హీరోయిన్ గా నటిస్తుంది.

https://www.instagram.com/p/B0GEQVGnJbN/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -