Friday, May 3, 2024
- Advertisement -

కోహ్లీనే కెప్టెన్.. వెస్డిండీస్ టూర్ లో బీసీసీఐ సంచలనాలు

- Advertisement -

ప్రపంచకప్ లో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ భయపడ్డట్టే ఉన్నాడు. అందుకే విశ్రాంతి ఇస్తామన్నా వద్దన్నాడు. వెస్టిండీస్ టూరుకు రోహత్ ను కెప్టెన్ చేద్దామని బీసీసీఐ నిర్ణయించి కోహ్లీని విశ్రాంతి తీసుకోమంది.. కానీ కోహ్లీ మాత్రం ఓటమి బాధలో తనకు విశ్రాంతి వద్దని తనే జట్టుతో వెళతానన్నాడు.

నిజానికి ఈ వెస్టిండీస్ టూరులో కోహ్లీ విశ్రాంతి తీసుకొని రోహిత్ పగ్గాలు చేపడితే టూర్ లో క్లీన్ స్వీప్ జరిగితే రోహిత్ కు పేరొస్తుంది. అతడి కెప్టెన్సీ సామర్థ్యాలు బలపడి పూర్తి స్థాయి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలుంటాయి. కోహ్లీ ఎసరువస్తుంది. అందుకే ప్రపంచకప్ ఓటమి తర్వాత కోహ్లీ విశ్రాంతికి ససేమిరా అన్నారు. ఇప్పుడు వెస్టిండీస్ టూర్ కు కొత్త జట్టును ఎంపిక చేశారు. ఇందులో కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. మూడు ఫార్మట్లకు కెప్టెన్ గా కోహ్లీనే ఎంపిక చేశారు. గాయపడ్డ శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చాడు.

ఇక టెస్ట్ టీమ్ కు తెలుగు ఆటగాడు హనుమ విహారికి చోటుదక్కింది. వన్డేల్లో అనూహ్యంగా నాలుగోస్థానం ఖాళీగా ఉండడంతో ఆ స్తానంలో యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే లను ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు.

టెస్టు జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైఎస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, పుజారా, హనుమ విహారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వర్ధమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కులదీప్, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా, ఉమేష్ యాదవ్.

టీ20 జట్టు: కోహ్లీ (కెప్టెన్), రోహిత్(వైఎస్ కెప్టెన్), శిఖర్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కృణాల్ పాండ్యా రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్,రాహుల్ చాహర్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్ నవదీప్ శైనీ

వన్డే జట్టు: కోహ్లీ (కెప్టెన్), రోహిత్(వైఎస్ కెప్టెన్), శిఖర్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా , కులదీప్, చాహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ శైనీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -