Thursday, May 9, 2024
- Advertisement -

శుక్రవారం వస్తున్న పాయల్ ‘మంగళవారం’

- Advertisement -

పాయల్ రాజ్‌పుత్..గ్లామర్‌కి కేరాఫ్. తన తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో కుర్రకారును షేక్ చేసింది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో పాయల్ అంద, చందాలకు ఫిదా కాని వారుండరూ. తొలి సినిమానే అయినా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి అదరహో అనిపించింది. ముఖ్యంగా పాయల్ గ్లామర్‌ షోకి ఫిదా అవ్వని వారుండరు. ఆ తర్వాత పలు మూవీలు చేసినా అంతగా గుర్తింపురాలేదు. అయితే సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోని ప్రదర్శిస్తూనే ఉంది పాయల్.

ఇక చాలాకాలం తర్వాత మంగళవారం అనే సినిమాలో నటిస్తున్న పాయల్. ఈ సినిమాని ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతే తెరకెక్కిస్తుండగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోంది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోగా తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌చేశారు.

నవంబర్ 17న పాన్ సౌత్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. పాయల్ పై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా మధుర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -