Thursday, May 2, 2024
- Advertisement -

చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి మంత్రి కేటీఆర్..

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్‌ను ఇక్కడి ప్రజలు లైట్ తీసుకున్నారు. పక్క రాష్ట్రం సంగతి మనకెందుకులే అన్నట్లు వ్యవహరించారు. అంతేందుకు తెలంగాణ టీడీపీ నేతలు సైతం ఎక్కడా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసిన దాఖలాలు లేవు. కానీ కొంతమంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్‌ పేరుతో హైదరాబాద్‌లో ఆందోళనలు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ధర్నా చేస్తున్న బాబు మద్దతు దారులకు చివాట్లు తప్పడం లేదు.

అయితే తాజాగా బాబు అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్…ఇక్కడెందుకు ర్యాలీలు తీస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీకి సంబంధించిందని…తమకు ఎటువంటి సంబంధం లేదని పరోక్షంగా బాబు ఆంధ్రా ప్రాంతంకు చెందిన వాడని చెప్పకనే చెప్పారు.

అంతేగాదు ఆంధ్రప్రదేశ్ లో ఒకరితో ఒకరు తలపడండి…. హైదరాబాద్ లో ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు. సున్నితమైన విషయాలను సెన్సిటివ్ గానే హేండిల్ చేయాలి. ఏపీలో ఏమైనా చేసుకోవచ్చు.ఆ రెండు పార్టీలకు ఇక్కడ స్థానం లేదు అని ఎన్నికల ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదనే ర్యాలీలను అనుమతించడం లేదన్నారు. లోకేష్ తనతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఇదే చెప్పానని వెల్లడించారు కేటీఆర్. ఇక జగన్‌, లోకేష్ ఇద్దరు తనకు మిత్రులేనని…తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటీ కారిడార్ ర్యాలీలు జరగలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఐటీ పరిశ్రమకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టే అనుమతించడం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఇకనైనా టీడీపీ ఐటీ సెల్ చేయిస్తున్న ఈ ర్యాలీలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -