Tuesday, April 30, 2024
- Advertisement -

మరో స్కాంలో లోకేష్…వదిలే ప్రశ్నే లేదా?

- Advertisement -

తండ్రి,కొడుకులు చంద్రబాబు,లోకేష్‌ల అవినీతి బాగోతం తవ్వినా కొద్ది బయటకు వస్తోంది. ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో నారా లోకేష్‌ను ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతుండగా తాజాగా మరో కేసులో బుక్కయ్యారు. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ పేరును చేర్చారు సీఐడీ అధికారులు. ఈ కేసులో A14గా లోకేష్‌ పేరును చేర్చగా ఏ1గా చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ కేసులో బాబును కస్టడీకి అప్పగించాలని ఇప్పటికే న్యాయస్ధానాన్ని కోరింది. దీంతో చంద్రబాబు విచారణ తర్వాత లోకేష్‌ను విచారించనుంది సీఐడీ. అలాగే ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో లోకేష్ పాత్ర ఉందని ఇప్పటికే తేల్చిన సీఐడీ అధికారులు ఆయన్ని త్వరలోనే ప్రశ్నిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్ట్, రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉండగా లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేగాదు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు లోకేష్‌. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఓ సీఐడీ బృందం ఢిల్లీకి వెళ్లినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వరుస కేసులు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇక చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో రేపు విచారణకు రానుండగా సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా రేపే విచారణకు రానుంది. ఇక ఈ నెల 28 నుండి 5 రోజుల పాటు కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో రేపు బెయిల్ రాకుంటే బాబు పరిస్థితి ఏంటా అని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచేందుకు వైసీపీ సిద్ధమవుతుండగా టీడీపీ మాత్రం స్కామ్‌లతో కొట్టుమిట్టాడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -