Monday, May 20, 2024
- Advertisement -

అక్కినేని కోడ‌లికి ఏమా ఫాలోయింగ్‌…

- Advertisement -

తెలుగు, త‌మిళ్ సినిమాల‌తో స‌మంత బిజీగా ఉంది. పెళ్ల‌యిన త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ సినిమాలు చేస్తుండ‌గా ఇటీవ‌ల ఆమెకు త‌మిళ‌నాడులో అభిమానులు షాకిచ్చారు. స‌మంత‌ను చివ‌రికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి విడుద‌ల చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

సినిమా నటులను త‌మిళనాడులో వీరాభిమానం చూపుతుంటారు. వారి అభిమానం ఒక్కోసారి ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. ఇప్పుడు అదే జ‌రిగింది. తెలుగువారింటి, అక్కినేని కోడలు సమంత తమిళనాడులో ఓ న‌గ‌ల దుకాణానికి ప్ర‌చార‌క‌ర్త‌గా పనిచేస్తోంది. ఇటీవ‌ల త‌మిళ‌నాడులోని కృష్టగిరి పట్టణంలో ఆ సంస్థ దుకాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రారంభానికి సమంత వ‌చ్చింద‌ని తెలుసుకొని తమిళ తంబీలు పోటెత్తారు. ఆ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. సమంత బ‌య‌ట‌కు వ‌స్తుంటే ఆమెను చూస్తామంటూ స‌మంత కారును చుట్టుముట్టేశారు. ఆమె కారు లోప‌లికి వెళ్తుంటే అభిమానులు మేడ‌మ్ సెల్ఫీ.. ఒక్క ఫొటో అంటూ ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఊప‌రాడ‌నంత ప‌ని చేశారు.

అభిమానుల తాకిడి ఎక్కువ కావ‌డంతో స‌మంత కారు ముందుకు కదిలే ప‌రిస్థితి లేకుండాపోయింది. చివరకు పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి లాఠీకి ప‌ని చెప్ప‌డంతో స‌మంత వెళ్లిపోయింది. కానీ అభిమానులు నిరాశ‌కు గుర‌య్యారు. స‌మంత‌పై కొంచెం కోప్ప‌డ్డారు.

ప్రస్తుతం సమంత తమిళంలో విశాల్‌తో పాటు రెమో ఫేం శివ కార్తికేయన్ సినిమాల్లో న‌టిస్తోంది. గ‌తంలో సూర్య త‌దిత‌ర న‌టుల‌తో జ‌త క‌ట్ట‌డంతో కోలీవుడ్‌లో అభిమానులు పెరిగిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -