Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ హీరో డ్యాన్స్ చేస్తే రూ.2 కోట్లు ఇస్తాం…

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారికి యమ క్రేజీ ఉంటుంది. వీరి కార్య‌క్ర‌మాల‌కు భారీ మొత్తంలో ముట్టుతాయి. అయితే వారి ఆటాపాట‌కు సెక‌న్‌కు కూడా రేటు ఉంటుంది. ఆ విధంగా సినిమాలు కాకుండా ప్రైవేటు కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏక‌మొత్తంలో ఓ హీరోకు ఇవ్వాల‌ని చూశారు. కేవ‌లం అర్ధ గంట డ్యాన్స్ చేస్తే ఏకంగా రూ.2 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశారు. అయినా ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించాడు బాలీవుడ్ హీరో.

ఆ హీరో ఎవ‌రో కాదు ర‌ణ్‌వీర్‌సింగ్‌. ‘బాజీరావ్‌ మస్తానీ’ సినిమాతో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ స్టార్‌డమ్ చేరుకున్నాడు. ఇటీవల విడుదలైన ‘పద్మావత్‌’ సినిమాలో మెరిశాడు. ఇప్పుడు రణ్‌వీర్‌కు వరుస సినిమా అవకాశాలు వ‌స్తున్నాయి.

అయితే ఇటీవ‌ల ర‌ణ్‌వీర్‌కు ఓ మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అదే ప్రైవేటు కార్య‌క్ర‌మం. ఓ వ్యక్తి తన ఇంట్లో జరిగే పెళ్లికి అరగంట పాటు డ్యాన్స్‌ చేయాలని కోరాడు. ఆ అర‌గంట డ్యాన్స్‌కు రూ.2 కోట్లు ఇస్తానని కూడా చెప్పాడు. అయితే ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించాడు. ఎందుకంటే ఇప్పటికే రణ్‌వీర్‌ ‘గల్లీబాయ్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈ స‌మ‌యంలో పెళ్లిలో డ్యాన్స్ చేసేంత టైమం లేద‌ని తేల్చి చెప్పేశాడ‌ట‌.

ర‌ణ్‌వీర్ న‌టిస్తున్న ‘గల్లీబాయ్‌’ సినిమాకి జోయా అక్తర్‌ దర్శకత్వం వహిస్తుండ‌గా ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన ‘గల్లీబాయ్‌’ విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -