Friday, May 17, 2024
- Advertisement -

రాఘవ కు చుక్కలు చూపించిన పోలీసులు!

- Advertisement -

ముని, కాంచ‌న‌, గంగ చిత్రాల‌తో మంచి నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రాఘ‌వ లారెన్స్‌. అయితే రాఘవ కి పోలీస్‍లు కాంచ‌న‌ సినిమా చూపెట్టడం ఏంటీ అనుకుంటున్నారా? వేందర్ మూవీస్ మదన్‌ తో మంచి స్నేహసంబంధాలు ఉన్న కారణంగా ఓ కేస్ విచారణలో పోలిసులు లారెన్స్ ను రెండు గంటలకు పైగా ప్ర‌శ్నించార‌ని తెలుస్తోంది.

అయితే మదన్ సైడ్‌బిజినెస్‌గా కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తాన‌ని కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టాడ‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఈ వివదాలకు సంబంధించి కేంద్ర‌బిందువైన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంతో మ‌ద‌న్‌కు గట్టి సంబంధాలే ఉన్నట్లు పోలీసులు ధ్రువీక‌రించారు. చివరికి మదన్ కు మంచి ఫ్రేండ్ అయిన రాఘవ లారెన్స్ కూడా పోలీసులు వదల్లేదు. తమిళనాడు లోని క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు సోమవారం రెండు గంటల పైగానే రాఘవ లారెన్స్ ను విచారించారట.

మ‌ద‌న్ కేసులు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తుండ‌టంతో త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. ఇదే కేసులో లారెన్స్‌కు ఏమైన సంబంధాలు ఉన్నాయేమో అని రాఘ‌వ లారెన్స్‌ను కూడా పోలీసులు ప్ర‌శ్నించారు. మరి ఈ కేసులో ఇంకెంతమంది సినీ పెద్దలు బయతపడతారోనని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -