Monday, May 27, 2024
- Advertisement -

సుహాస్‌కి పొలిటికల్ ఆఫర్!

- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమై హీరోగా మారిన నటుడు సుహాస్. చిన్న సినిమా దర్శకులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సుహాస్ మినిమం హిట్ గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. వరుసగా బ్యాక్ టూ బ్యాక్‌ హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇక ప్రసన్న వదనం సినిమాతో లేటెస్ట్‌గా హిట్ కొట్టిన సుహాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ రోజు మా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చిందని…. ఇలా ఓ పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తారా అని అడిగారని చెప్పారు. అంతేగాదు అమౌంట్ కూడా భారీగానే ఇస్తామని చెప్పారని వెల్లడించగా నాకు డౌట్ వచ్చి నన్నేనా అని అడిగాను. మిమ్మల్నే సర్ అని చెప్పాడు. అయితే ఆ ఆఫర్ హ్యూజ్ అమౌంట్ అయినప్పటికి దానికి తాను నో చెప్పానని తెలిపారు.

ప్రస్తుతం తన ధ్యాస అంతా సినిమాలపైనే ఉందని ఏ పొలిటికల్ పార్టీ వైపు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. అయితే తనను సంప్రదించిన పొలిటికల్ పార్టీ పేరు మాత్రం చెప్పలేదు సుహాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -