- Advertisement -

ఎన్నిక‌లే టార్గెట్‌గా తెర‌పైకి రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్స్‌..!

- Advertisement -

ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో సినిమాలకు, రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మన హీరోలు ఎందరో రాజకీయాల్లో ఎంటరయ్యారు. ఇంకొందరు రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ప్రెజెంట్ కొంత మంది హీరోలు…ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకపోయినా…పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తూ ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు.

నేటి బాలలే రేపటి పౌరులన్నట్టు…నేటి నటులే…రేపటి పొలిటిషన్స్ అని మన రాజకీయాలను చూస్తూ ఇట్టే చెప్పొచ్చు. జనరల్ ఎలక్షన్స్‌కు దగ్గర పడటంతో..చాలా మంది స్టార్ హీరోలు…రాజకీయ నేపథ్యమున్న మూవీలతో ఇప్పటి నుంచే రాజకీయ వేడి పుట్టిస్తున్నారు

ఈ యేడాది మహేశ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ మూవీ కూడా రాజకీయా నేపథ్యంలో తెరకెక్కిన మూవీనే. ఈమూవీలో మహేశ్ ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిలో నటించాడు.అంతకు ముందు ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ సమ సమాజ్ పార్టీ అంటూ పొలిటికల్ లీడర్ క్యారెక్టర్‌లో కనిపించాడు. మరోవైపు కళ్యాణ్ రామ్ చేసిన ‘ఎమ్మెల్యే’ కూడా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే.

మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ కూడా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీనే. ఈ సినిమాలో బాలయ్య…వాళ్ల నాన్న దివంగత రామారావు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి పాత్రలో రానా యాక్ట్ చేస్తున్నాడు. గతంలో బాలయ్య హీరోగా నటించిన ‘అధినాయకుడు’, ‘లెజెండ్’ వంటి సినిమాలు కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాలే కావడం విశేషం.

రానా విషయానికొస్తే.. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘లీడర్’, తేజ డైరెక్షన్‌లో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి సినిమాలు కూడా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కినవే. లేటెస్ట్‌గా రానా… ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో రియల్ పొలిటికల్ లీడర్ చంద్రబాబు పాత్రలో నటించడం విశేషం.

ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ మూవీతో పాటు ఇంకోవైపు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ కూడా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమానే. ఈ మూవీలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఈ మూవీని వైయస్.జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్ జీవితంపై నాజర్ హీరోగా ‘ఉద్యమ సింహం’ అనే సినిమా తెరకెక్కుతోంది.

ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ..దివంగత జయలలిత జీవితం ఆధారంగా ‘అమ్మ’ టైటిల్‌తో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీని జయలలిత పుట్టినరోజున షూటింగ్ ప్రారంభిస్తారట. ఈ బయోపిక్‌లో విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.

మరోవైపు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవితంపై విద్యాబాలన్ హీరోయిన్‌గా ఒక వెబ్ సిరిస్ తెరకెక్కనుంది. ఇంకోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితకథ ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్..మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇంకోవైపు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా పరేష్ రావల్ ఒక మూవీని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మొత్తానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు ఒకరి వెనకాల ఇంకొకరు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సిన్మాలు చేస్తూ…ఇప్పటి నుంచే రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -