మామూలుగానే ధనిక కుటుంబంలో పుట్టిన వ్యక్తులకు పెద్దగా కష్టాలు తెలియవు.వారి ఆలోచనలు కూడా ఆ విధాంగానే ఉంటాయి.కాని సెలబ్రిటీ పిల్లలకు కూడా కష్టాలు తప్పడం లేదు.తాజాగా తనకు జరిగిని బాధను మీడియా ఎదుట వెళ్లబోసుకుంది.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకురాలిగా, నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.కొంతకాలం పాటు ఆమె ఓ వ్యక్తితో డేటింగ్ చేసేదట.
అతడికి విపరీతమైన తాగుడు అలవాటు ఉండేదని, తాగొచ్చి ఆమెని కొట్టేవాడని షాకింగ్ కామెంట్స్ చేసింది పూజా భట్. మహేష్ భట్ కూతుర్ని అయినంత మాత్రమా.. నాకు తక్కువ బాధ కలగదు కదా..? అంటూ ప్రశ్నించింది.అసలే నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ ,అతనిపై పెద్ద యుద్ధమే చేస్తున్న సమయంలో ,ఇప్పుడు తాజాగా మరో స్టార్ డైరెక్టర్ కూతురునే లైంగికంగా వేధించడం సంచలనంగా మారింది.
