వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. పాదయాత్రతో సుదీర్ఘంగా జగన్ ప్రజల్లో ఉన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్క నియోజక వర్గంమీద ప్రధానంగా దృష్టిసారించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది. అక్కడ ఎవరు పోటీ చేస్తే… వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే అవకాశం ఉందనే దానిపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోంది. దాని ప్రకారంబడే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లను కేటాయించనున్నారంట జగన్.
2014 లో చేసిన తప్పులు మరో సారి పునరావృతం కాకుండా పకడ్భంధీ వ్యూహాలతో ముందుకెల్తున్నారు. తనకు వచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్న ఆ పార్టీ అధినేత జగన్… ఈ క్రమంలోనే ఒక్క జగన్ ఇమేజ్‌తో గెలవాలని చూస్తున్న పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మారుస్తు నేతలకు షాక్ ఇస్తున్నారు జగన్.
కొద్ది రోజుల క్రితం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి వంగవీటి రాధాకృష్ణను తప్పించడం సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగించారు జగన్. వంగవీటి వర్గీయులు ఎంతగా ఆందోళనలు చేసినా… ఈ విషయంలో పార్టీ వెనక్కి తగ్గలేదంటూ సంకేతాలిస్తున్నారు.
వచ్చే ఎన్నికలు తమ పార్టీకి ఎంతో కీలకం కావడంతో… అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నియోజకవర్గంలో పేరున్న నేతలను కాకుండా సర్వే రిపోర్టుల్లో మొగ్గు ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారని సమాచారం.ఎంతటి పెద్ద నాయకుడికైనా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో పలు నియోజక వర్గాల్లో తమకు టికెట్ దక్కుతుందా లేదా అన్న టెన్సన్ పట్టుకుంది.
