- Advertisement -

క‌వ‌ర్ పేజీపైకెక్కిన పూజా హెగ్డె అందాలు

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవ‌రు అంటే అంద‌రు ఠ‌క్కున చెప్పే పేరు పూజా హెగ్డె. త‌మిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారింది. బ‌న్ని, ఎన్టీఆర్ వంటి హీరోల‌తో పాటు నాగ‌చైత‌న్య‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వ‌రుణ్ తేజ్ వంటి హీరోల‌తో న‌టించింది. పూజా హెగ్డె ప్ర‌స్తుతం మ‌హేశ్‌తో మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ కొత్త సినిమా, బ‌న్ని-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాలో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డెనే ఎంపిక చేశారు.

పూజా హెగ్డె రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఓ ఐటం సాంగ్‌లో క‌నిపించి మెప్పించింది. పూజా హెగ్డె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కొత్త సినిమా విశేషాల‌తో పాటు , త‌న లేటెస్ట్ ఫోటోల‌ను కూడా అభిమానులు కోసం షేర్ చేస్తుంటుంది. అమ్మ‌డు అందాలు ఆరోబోయ‌డంలో ఎటువంటి అభ్యంత‌రం తెల‌ప‌లేదు. అల్లు అర్జున్‌తో క‌లిసి న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథ్ సినిమాలో బికినిలో క‌నిపించి అంద‌రికి షాకిచ్చింది. బికినిలో పూజా హెగ్డె అందాలు మ‌రింత అందంగా క‌నిపించాయి. తాజాగా ఈ భామ మ‌రో హాట్ లుక్‌తో ద‌ర్శ‌నం ఇచ్చింది. ఈసారి పూజా హెగ్డె త‌న అందాల‌ను క‌వ‌ర్ పేజీపై పొందుప‌రిచింది. ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కవర్ పేజీపై సెక్సీ లుక్‌తో మ‌త్తెక్కించింది. డార్క్ థీమ్.. డార్క్ యాంబియెన్స్ లో డార్క్ ప్రాపర్టీ నడుమ థిక్ డిజైనర్ పర్పుల్ వేర్ లో పూజా ఇచ్చిన ఫోజు కిల్లింగ్ అనే చెప్పాలి. చింత పిక్క రంగు డిజైనర్ టాప్ లో దుమ్ము రేపేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -