Thursday, May 9, 2024
- Advertisement -

స‌మంత బెస్ట్ ఫ‌ర్మామెన్స్ ఇదేన‌ట‌..!

- Advertisement -

అక్కినేని ఇంటి కొడ‌లు స‌మంత హీరో నాగ‌చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. పెళ్లి త‌రువాత స‌మంత న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. దీంతో స‌మంతకు ఫుల్ డిమాండ్ ఏర్పిడింది. తెలుగు,తమిళ భాష‌ల‌లో సినిమాలు చేస్తు బిజీ హీరోయిన్‌గా మారింది. స‌మంత చేతిలో ప్ర‌స్తుతం నాలుగు సినిమాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి పెళ్లి తరువాత మొద‌టిసారి న‌టిస్తున్న సినిమా మ‌జిలి. ఈ సినిమా వ‌చ్చే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. స‌మంత త‌మిళంలో తాజాగా న‌టించిన చిత్రం “సూపర్ డీలక్స్” . ఈ సినిమాలో స‌మంత‌తో పాటు ర‌మ్య‌కృష్ణ‌, ,తమిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించారు. ఈ సినిమా రమ్య‌కృష్ణ వేశ్య పాత్ర‌లో కనిపించింది. ఇక విజ‌య్ సేతుప‌తి అయితే హిజ్రాగా క‌నిపించి మెప్పించాడు. ఈ ముగ్గురి న‌ట‌న కోసం సినిమాను చూడ‌వ‌చ్చ‌నే టాక్ తమిళ‌నాడులో వినిపిస్తుంది.

ముఖ్యంగా సమత కెరియర్లోనే అద్భుతంగా చేసిన పాత్రల జాబితాలో ఈ సినిమాలోని పాత్ర ముందుగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె నటన అద్భుతమంటూ అక్కడి క్రిటిక్స్ ప్రశంసిస్తూ రాస్తున్నారు.ఈ సినిమా హిట్‌తో త‌మిళ ఇండ‌స్ట్రీలో స‌మంత మ‌రి కొంత‌కాలం సినిమాలు చేసే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -