Thursday, May 16, 2024
- Advertisement -

రంగస్థలంలో పూజా హెగ్దేకి ఏం పని..?

- Advertisement -

పూజా హెగ్డే.. పొడుగు కాళ్ళ సుందరి అయిన ఈ భామ హోమ్లీగా నటన కనబరిచి.. దువ్వాడ జగన్నాథంలో తన అందచందాలతో అభిమానులను పిచ్చేక్కించింది. ప్రధానంగా సాంగ్స్ లో అల్లు అర్జున్ తో ఆమె చేసిన డ్యాన్స్ సూపర్ అని చెప్పాలి. ఆమె స్టెప్పులను చూసిన డైరక్టర్ సుకుమార్ ఆమెని తన సినిమాలో వాడాలని నిర్ణించుకున్నాడు.

అందుకే పూజలతో ఓ ప్రత్యేకమైన సాంగ్ చేయించాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్.. రామ్ చరణ్ తో రంగస్థలం 1985 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాలో అనసూయ ఓ స్పేషల్ రోల్ లో కనిపిస్తుండగా.. ఐటెం సాంగ్ కోసం చిత్ర బృందం కరీనా కపూర్, సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రాలను అనుకున్నారు.

అయితే చివరికి పూజా హెగ్దే ని పైనల్ చేసినట్లు సమాచారం. త్వరలో రామ్ చరణ్, పూజా హెగ్డే లపై ఈ పాటను తెరకెక్కించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు తదితరులు నటిస్తున్న రంగస్థలం1985 సినిమా ఫస్ట్ లుక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ లో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -