- Advertisement -

చినజీయర్ స్వామితో జ‌గ‌న్‌ సమావేశమయ్యారు.. ఎందుకు..?

- Advertisement -

తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. త్రిదండి చినజీయర్‌ స్వామితో సమావేశమయ్యారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులతో కలిసి.. శంషాబాద్ లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి వెళ్ళారు. జగన్ అక్కడకు వెళ్ళడంతో ఆయన ను సాదరంగా తన ఆశ్రమానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామీజీ.. వెళ్ళేటప్పుడు కూడా జగన్ కారు దగ్గరకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు.

దసరా సెలవుల నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో బెంగుళూరు కు వెళ్లారు. అటు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన ఈ రోజు చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. చినజీయర్‌తో జగన్ అరగంట పాటు సమావేశమయ్యారు. ఇక జగన్ తో పాటు విజయ్ సాయి రెడ్డి ఇతర వైసీపీ నాయకులతో పాటు మై హోం అధినేత‌ రామేశ్వరరావు కూడా ఉన్నారు. అయితే చిన‌జీయర్ స్వామిని జ‌గ‌న్ కలవడంపై టీడీపీ త‌ట్టుకోలేక రక రక వార్తలు సృష్టిస్తున్నారట.

అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే స్వామీజీల ద్వారా లాబీయింగ్ చేయాలనే జగన్ అలా చేస్తున్నారని కొందరు టీడీపీ నేతలు అంటున్నారట. ఏది ఏమైన జగన్, జీయర్ స్వామిజీ నడుమ ఏకాంత చర్చలు జరగడంతో టీడీపీ బ్యాచ్ మాత్రం త‌ట్టుకోలేక పోతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -