జగన్మోహన్ రెడ్డి ఈ సారి టికెట్ల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తున్నాడు. తన వెనక నమ్మకంగా ఉంటారని నమ్మిన ఎమ్మెల్యేలు మోసం చేసున తీరును జగన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను జగన్ ఈ సారి ఎలాగైన ఓడించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.
కావాలని అడిగి తీరా గెలిచిన తర్వాత జంప్ అయినవారిని ఇప్పటి నుంచే వడపోత చేయాలని ముఖ్య నేతలకు జగన్ సూచించారట. వైసీపీ మీద నమ్మకంతోనూ, అభిమానంతోనూ ప్రజలు ఓట్లేస్తే అధికారం కోసం పార్టీకి ద్రోహం చేసినవారి జగన్ మర్చిపోలేక పోతున్నారు. ఇక పార్టీ కోసం తన వెంట పడిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విషయాన్ని ఈ సందర్భంగా కొందరు నేతల వద్ద ప్రస్తావించారు. జలీల్ ఖాన్ టిక్కెట్ కోసం.. తన దగ్గరకు వచ్చి.. అధికారంలోకి రాకపోయేసరి పార్టీ మారి.. తనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారని.. ఇలాంటి స్వభావం ఉన్న నేతలను ముందుగానే పసిగట్టి వరిని దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి కట్టుబడే ఉండేవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు.
ఇందుకు వైసీపీ సీనియర్ నేతలతో పాటు.. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా సలహాలు కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ఏడాదికి ముందుగానే అన్ని నియోజ్కవర్గాల్లోనూ అభ్యర్ధులను రంగంలోకి దించాలని చూస్తున్న జగన్ ముందుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు 20 మందిపై బలమైన అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ 20 నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే రెండు మూడు సార్లు సర్వేలు చేసి ఇద్దరు ముగ్గురు బలమైన అభ్యర్థుల పేర్లను జగన్కు సూచించారు. మరి వీరిలో జగన్ ఎవరి పేర్లను ఈ 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఫైనలైజ్ చేస్తారో చూడాలి. మొత్తానికి జగన్ టార్గెట్ మాత్రం నమ్మించి మోసం చేసిన 20 మంది ఎమ్మెల్యేలపైనే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
