Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ప్రేమ చాలా గొప్పది….. పవన్‌పై పూనం కౌర్ లవ్ ట్వీట్…. రచ్చ రచ్చే

- Advertisement -

పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి చేసిన ఆరోపణల్లో పూనం కౌర్ వ్యవహారమే మరీ అనుమానాస్పదంగా ఉంది. కత్తితో పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేసుకున్న నేపథ్యంలో అంతా సద్దుమణిగిందనుకుంటే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రేమ గురించి పూనం చేసిన షాకింగ్ ట్వీట్స్ మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తన్నాయి.

పూనం కౌర్‌తో పవన్ కళ్యాణ్ ప్రేమ వ్యవహారం, పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వడంతో పూనం కౌర్ సూసైడ్ అటెంప్ట్ చేయడం, త్రివిక్రమ్ సమక్షంలో పవన్-పూనం కౌర్‌లు కలిసి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు నిర్వహించడం, అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్-పూనం కౌర్‌లు ఒకే గోత్ర నామంతో తిరుమలలో పూజలు చేయించుకోవడం లాంటి విషయాలన్నీ సాక్ష్యాధారాలతో సహా మహేష్ కత్తి చెప్పడంతో తెలుగు ప్రజలను షాక్‌కి గురి చేశాయి.

మహేష్ కత్తి చెప్పిన విషయాలపై తన స్పందన ఏంటో తెలియచేయని పూనం…….ఆ వెంటనే కత్తి చెప్పిన విషయాలపై పవన్ స్పందించాలంటూ, తనకు అండగా నిలబడాలన్న అర్థం వచ్చేలా వరుసగా ట్వీట్స్ చేసి మరిన్ని అనుమానాలు పెంచింది. ఆ వెంటనే తను చేసిన ట్వీట్స్ అన్నింటినీ డిలీట్ చేయడంతో ఆ అనుమానాలన్నింటికీ బలం చేకూర్చినట్టైంది. ఇక మెగా కాంపౌండ్ నుంచి పూనంకౌర్‌కి హెచ్చరికల వ్యవహారం అంటూ, అలాగే యాభై లక్షలకు సెటిల్‌మెంట్ వ్యవహారాలు నడిపారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్‌ది డివైన్ లవ్, అద్భుతమైన ప్రేమ అంటూ పికెలవ్ అన్న హ్యాష్ ట్యాగ్‌తో చేసిన ట్వీట్ మరోసారి సంచలనమైంది. ఆ వెంటనే రియాక్ట్ అయిన పవన్ అభిమానులు కూడా …..జరిగిన రచ్చ చాలు…….దయచేసి రెచ్చగొట్టకు……అంటూ పూనం కౌర్‌ని రిక్వెస్ట్ చేయడం గమనార్హం. కత్తి వర్సెస్ పవన్ ఇష్యూ సెటిల్ అయిన నేపథ్యంలో పూనం కౌర్ వర్సెస్ పవన్ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -