Tuesday, May 14, 2024
- Advertisement -

మూడో టెస్ట్‌లోకి ర‌హానే….?

- Advertisement -

ద‌క్షిణాఫ్రికా టూర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలుండ‌గానే భార‌త్ టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకుంది. రెండు మ్యాచ్‌ల‌ల్లోనూ గెలిచే అవ‌కాశాలున్నా స్వీయ త‌ప్పిదం కార‌నంగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. సిరీస్ కోల్పోవ‌డంపై కెప్టెన్ విరాట్ మీద విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే.

అయితే జొహెన్నెస్‌బర్గ్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో అజింక్య రహానేకు చోటు దక్కనుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓటమిపాలై సిరీస్ కోల్పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఫామ్ పేరిట విదేశాల్లో మెరుగైన బ్యాటింగ్ రికార్డ్ ఉన్న రహానేను కోహ్లి పక్కనబెట్టడం వివాదాస్పదమైంది. అతడి స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో రహానేకు చోటు కల్పించాలంటూ మాజీలు డిమాండ్‌ చేశారు.

మూడో టెస్టులో నెగ్గడం ద్వారా విమర్శకులు దీటుగా బదులివ్వాలని కోహ్లి భావిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాహుల్, పుజారా, మురళీ విజయ్ ముందుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో రహానే, హార్దిక్ పాండ్యలతో కోహ్లి సీరియస్‌గా చర్చలు జరిపాడు. దాదాపు 25 నిమిషాలపాటు వీరి మధ్య మంతనాలు సాగాయి.

కోహ్లి చెబుతున్నంతసేపు పాండ్య శ్రద్ధగా విన్నాడు. రాహుల్, విజయ్, పుజారా ప్రాక్టీస్ ముగిశాక కోహ్లతోపాటు పాండ్య, రహానే నెట్స్‌లో శ్రమించారు. నెట్ సెషన్, స్లిప్‌లో క్యాచ్‌లు పట్టడం ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత కూడా కోహ్లి, రహానే నెట్స్‌లోనే గడిపారు. మూడో టెస్టులోనైనా గెలిచి వైట్‌వాష్‌నుంచి త‌ప్పించుకుంటారా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -