Tuesday, May 21, 2024
- Advertisement -

పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. కత్తి ట్వీట్‌కు ఘాటు రిప్లై…

- Advertisement -

పూన‌మ్ కౌర్ మ‌రో సారి వార్త‌ల్లోకెక్కారు. మన దేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్‌స్టార్స్‌కే ఎక్కువ గౌరవమర్యాదలు ఇస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది.

దేశంలో పోర్న్ స్టార్లకు ఉన్నంత గౌరవం సాధారణ మహిళలకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో మరెవరికీ దక్కని జీవితం, గౌరవం వారికి దక్కుతున్నాయని పేర్కొంది. జీవితంలో ఏదైనా సాధించాలని ముందుకొచ్చే మహిళలను వేధించడం, అభాండాలకు గురిచేయడం పరిపాటిగా మారిందని పేర్కొంది. దీంతో వారు తమ ఆత్మాభిమానాన్ని, మనసును, శరీరాన్ని చంపుకుని బతకాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

 

ఇటీవల పవన్ కళ్యాణ్‌కు మద్దుతుగా కత్తి మహేష్‌‌‌కు ట్వీట్ చేసి కొత్త వివాదానాకి తెరలేపిన పూనమ్ కౌర్.. ఇప్పుడు చేసిన కామెంట్ ఆలోచింపజేసేలా ఉండటం గమనార్హం. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఆర్జీవీ రూపొందించిన ‘జీఎస్టీ’ని మెచ్చుకుంటూ కత్తి మహేష్ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా కౌర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

రామ్‌గోపాల్ వర్మ, కత్తి మహేష్ మధ్య ఇటీవల ‘కెమిస్ట్రీ’ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్జీవీ విడుదల చేసిన ‘జీఎస్టీ’కి కత్తి మహేష్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ‘‘మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో, వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అని ట్వీట్ చేశాడు.

కత్తి మహేష్ ఈ ట్వీట్లు చేసిన కొద్ది గంటల్లోనే పూనమ్ కౌర్.. ఈ ట్వీట్ చేసింది. ఆర్జీవీ ‘జీఎస్టీ’కి కత్తి సపోర్ట్ చేయడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. సామాజికవేత్తవని చెప్పుకుంటున్న నువ్వు ‘పోర్న్’ స్టార్లను ప్రోత్సహిస్తావా? అశ్లీలతకు మద్దతు ఇస్తావా? విలువలు గురించి మాట్లాడే నీకు ఇప్పుడు విలువలు గుర్తు రావడం లేదా అంటూ కత్తిపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -