Monday, May 6, 2024
- Advertisement -

ఐసీసీ అవార్డ్స్ : క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కోహ్లీ..

- Advertisement -

కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలై నిరుత్సాహానికి గురైన భారత క్రికెట్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త. ఐసీసీ ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులతోపాటు ఐసీసీ టెస్టు, వన్డేల కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. గతేడాది ఆటగాడిగా పరుగుల వరద పారించడంతోపాటు నాయకుడిగానూ జట్టుకు తిరుగులేని విజయాలు అందించిన కోహ్లి ఐసీసీ అవార్డులను ఎగరేసుకుపోయాడు.

2012లో తొలిసారి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్‌ను అందుకున్న కోహ్లి.. ఐదేళ్ల తర్వాత తిరిగి ఆ దాన్ని సొంతం చేసుకున్నాడు. గత ఏడాది వన్డేల్లో ఆరు సెంచరీలు సాధించిన విరాట్ 76.84 సగటుతో పరుగులు రాబట్టాడు. లక్ష్య చేధనలో 65.29 సగటుతో పరుగులు రాబట్టిన కోహ్లి.. విజయవంతమైన ఛేదనల్లో 93.64 సగటుతో పరుగులు చేయడం విశేషం.

2013 నుంచి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్‌ను దక్షిణాఫ్రికా ఆటగాళ్లే ఎగరేసుకు పోతున్నారు. కాగా విరాట్ ఈ ఏడాది కోహ్లి సొంతం చేసుకోవడం విశేషం. మరొకవైపు విశేషమైన టాలెంట్‌ ఉన్న క్రికెటర్ల గౌరవ సూచకంగా ఇచ్చే ఐసీసీ సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీని సైతం కోహ్లి గెలుచుకున్నాడు. ఈ మేరకు గురువారం ఐసీసీ విడుదుల చేసిన అవార్డులను కోహ్లి స్వీప్‌ చేశాడంటూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొంది.

ఇక ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ గెలుచుకోగా, ఐసీసీ టీ20 ఫెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్ అవార్డును టీమిండియా యువ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ దక్కించుకున్నాడు. ఎమర్జెంగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును పాకిస్తాన్‌ క్రికెటర్‌ హసన్‌ అలీ గెలుచుకున్నాడు. ఐసీసీ ఫ్యాన్స్‌ మూమెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును చాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు దక్కించుకుంది

ఐసీసీ వన్డే క్రికెటర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికవడం పట్ల విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. 2016లో అశ్విన్ ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌గా నిలవగా.. ఈసారి కూడా టీమిండియా క్రికెటర్‌కే దక్కడం విశేషం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -