Wednesday, May 22, 2024
- Advertisement -

సర్దార్.. సందడి

- Advertisement -

విడుదలయ్యేది వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 8). మహా అంటే సోమవారం నుంచో, మంగళవారం నుంచో టికెట్ల అమ్మకాలు మొదలవుతాయి. కానీ.. వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కదా. అందుకే పోయిన శుక్రవారం నుంచే అమ్మకాలు మొదలయ్యాయి.

ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటు.. మామూలు ప్రేక్షకులు కూడా టికెట్లు కొనేయడం మొదలు పెట్టారు. కొన్ని థియేటర్లలో టికెట్లు దొరకని పరిస్థితి కూడా ఉండడంతో.. అవసరమైతే సినిమా విడుదలైన తెల్లారి, ఆ మర్నాడు కూడా టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు.

దీంతో.. సర్దార్ సినిమాకు భారీ లాభాలు ఖాయమని.. సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందన్న విషయంతో సంబంధం లేకుండానే.. టికెట్ల సేల్స్ ఇలా ఉంటే.. ఏ మాత్రం సర్దార్ కు పాజిటివ్ బజ్ వచ్చినా.. ఇక పవర్ దూకుడు ఆగే సమస్యే లేదని స్పష్టం చేసేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -