Thursday, May 16, 2024
- Advertisement -

అనుష్కను ‘అలా’ చూడొద్దట

- Advertisement -

యోగా బ్యూటీ అనుష్క.. తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. తనను అందరూ అనుష్కగానే చూడాలని.. ఇంకోలా చూడొద్దని ఆమె కోరుకుంటోంది. ఇంకోలా.. అంటే వేరే అర్థం కాదు లెండి. ఆ మధ్య.. తనను ఎక్కువగా కరీనా కపూర్ తో పోల్చి చూసేవారని.. మొదట్లో కాస్త కొత్తగా అనిపించినా.. ఇప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉందని చెబుతోంది.

బాలీవుడ్ లో హీరోయిన్ల క్యారెక్టరైజైషన్ ఒకలా.. సౌత్ లో మరోలా ఉంటుందనీ.. బెంగళూరు బ్యూటీ అంటోంది. అందుకే.. తననే కాదు. మరే ఇతర హీరోయిన్ ను అయినా.. ఎవరితో కంపేర్ చేసి చూడొద్దని.. ఆ పోలిక చాలా ఇబ్బందిగా ఉంటుందనీ చెబుతోంది.

అనుష్క ముచ్చట విన్నవాళ్లంతా.. ఓ మాట అంటున్నారు. కొత్తలో కరీనా కపూర్ తో పోలిస్తే సంబరపడి ఆమె.. ఇప్పుడు మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాక అలాంటి పోలిక వద్దనడం వెనక.. ఏదైనా రీజన్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎంతైనా కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్న సామెత ఉండనే ఉంది కదా అని సెలవిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -