Monday, April 29, 2024
- Advertisement -

మాళ‌విక మోహ‌న‌న్ చేసిన ఆ ప‌నికి దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు

- Advertisement -

మ‌ళయాళీ భామ మాళ‌విక మోహ‌న‌న్ చేసిన ఓ ప‌ని నెటిజ‌న్ల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. దాంతో ఆమెను దుమ్మెత్తిసపోస్తున్నారు. ‘‘దయచేసి అభిమానుల ఎమోషన్స్‌తో కామెడీ చేయకు’’ అని కామెంట్లు పెట్టారు. తమిళ చిత్రాలు ‘పేట’, ‘మాస్టర్‌’తో ఆక‌ట్టుకున్న న‌టి మాళవిక మోహనన్‌. త్వరలో తెలుగులోనూ అడుగుపెట్టబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సుందరి హాట్‌హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.

వాలంటైన్స్‌ సందర్భంగా ఆమె ఇచ్చిన ఓ సర్‌ప్రైజ్‌కు నెటిజన్లు మండిపడుతున్నారు. తను లవ్‌లో ఉన్నట్లు, బాయ్‌ఫ్రెండ్‌ని అందరికీ పరిచయం చేస్తానని కొదిరోజుల క్రితం చెప్పింది. అయితే బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసే వీడియోకు మిలియన్ వ్యూస్‌ రావాలని కండీషన్‌ కూడా పెట్టింది. ఈ మేరకు వాలంటైన్స్‌డే రోజున‌ ఆ వీడియో షేర్‌ చేసింది. అందులో ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు భావోద్వేగ పదాలు వాడుతూ కాస్త ఓవర్‌ చేసింది.

తీరా చూస్తే అది ఓ కార్‌ కంపెనీకి సంబంధించి ప్రకటన. ఆ వీడియో చూసిన వారంతా ఆమెను తిట్టిపోస్తున్నారు. నిజంగానే తన లవర్‌ని చూపిస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫాలోయర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ‘మాళవిక మరీ ఇంత మోసమా’ అంటూ మండిప‌డుతున్నారు.

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -