Monday, May 5, 2025
- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్​ సాంగ్ లో రానా, ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణ..!

- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు విడుదల ముందే భారీ హైప్​ క్రియేట్​ చేయాలని మేకర్స్​ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్​ వీడియో యూట్యూబ్​లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఆర్​ఆర్​ఆర్​ సినిమా కోసం భారీ ప్రమోషన్​ సాంగ్​ ప్లాన్​ చేశారట. రూ. 6 కోట్లు సెట్​ వేసి ఈ సాంగ్​ను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ప్రమోషన్​ సాంగ్​లో ఆర్​ఆర్​ఆర్​ సినిమా కోసం పనిచేసిన అన్ని విభాగాల వాళ్లు కనిపించబోతున్నారట.

అంతేకాక.. బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్, రానా కూడా ఈ ప్రమోషన్​ సాంగ్​లో కనిపించబోతున్నారని సమాచారం. మొత్తానికి ఆర్​ఆర్​ఆర్​ విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచేయాలని మేకర్స్​ భావిస్తున్నారు. ఇందుకోసం అనేక టీవీ షోలు, యూట్యూబ్​ ఇంటర్వ్యూలు ప్లాన్​ చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు ట్రెండింగ్​ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు సాగిస్తున్నారు.

విడుదలకు ముందు ఓ నెలరోజుల పాటు ఎక్కడ చూసినా.. ఆర్​ఆర్​ఆర్​ గురించే మాట్లాడుకోవాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారట. అలా చేస్తేనే భారీ ఓపెనింగ్స్ వస్తాయని వారు భావిస్తున్నారు.ఇక దర్శకుడు రాజమౌళికి ఇప్పటివరకు అపజయం లేదు. ఆడియన్స్​ కావాల్సిన ఎమోషన్స్​ అన్ని తన సినిమాలో ఉండేలా చూసుకుంటాడు జక్కన్న. ఇక పాటలు, ఫైట్​లు, మాస్​ అంశాలు కూడా మేళవించి ఓ అద్భుత మైన సినిమాను ఆవిష్కరిస్తాడు. అందుకు తగ్గట్టుగానే ముందుగా భారీ హైప్​ క్రియేట్​ చేయాలని భావిస్తున్నారు.

Also Read

సీక్రెట్ గా..స్పీడ్ గా.. కొత్త సినిమా షూటింగ్ ముగించిన మారుతి..!

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -