20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ భార్య షాలిని. ఆమె అజిత్ ను పెళ్లి చేసుకోక ముందే కోలీ వుడ్ లో స్టార్ హీరోయిన్. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమిళ్ లో పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో మాధవన్ హీరోగా, షాలిని హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సఖి. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత అజిత్ తో కలిసి షాలిని అద్భుతం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత షాలిని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు తాజాగా 20 ఏళ్ల తరువాత షాలిని మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. తమిళ్ లో మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం షాలినిని సంప్రదించగా ఆమె నటించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. తన ఫేవరెట్ దర్శకుడు మణిరత్నం అడిగినందువల్లే సినిమాల్లో తిరిగి నటించేందుకు షాలిని అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లో కొనసాగుతారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. తెలుగులో బాల నటిగా ఎంతో ఫేమస్ అయిన బేబీ షామిలికి షాలిని కి స్వయానా అక్క కావడం గమనార్హం. వీరిద్దరూ కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కూడా నటించారు.

Also Read

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -