సీక్రెట్ గా..స్పీడ్ గా.. కొత్త సినిమా షూటింగ్ ముగించిన మారుతి..!

- Advertisement -


డైరెక్టర్ మారుతి మంచి ఊపు మీదున్నాడు. ఏ సినిమా అయినా వేగంగా షూట్ చేయడం మారుతికి అలవాటు. అలాగే మరో సారి ఓ చిత్రాన్ని చడీచప్పుడు లేకుండా మారుతి కంప్లీట్ చేశాడు. షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాడో ఎప్పుడు పూర్తి చేశాడో కూడా తెలియకుండా ఓ సినిమాను తెరకెక్కించాడు. మారుతి స్పీడ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మారుతి ప్రస్తుతం గోపీచంద్, రాశీ కన్నా హీరోహీరోయిన్లుగా పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.

అయితే సెకండ్ వేవ్ ప్రారంభం కాగానే పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగానే మారుతి ఓ చిన్న హీరోతో నెలరోజుల్లో ఒక సినిమా కంప్లీట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను మారుతి ధృవీకరించ లేదు. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ మారుతి నెల రోజుల్లోనే ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు.

- Advertisement -

పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో ఆ గ్యాప్ లో సంతోష్ శోభన్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాకు యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే థియేటర్లలోకి రానున్నట్టు వారు తెలిపారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మారుతి ఇలా సీక్రెట్ గా, స్పీడుగా సినిమా ముగించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ప్రేమకథా చిత్రమ్ అనే సినిమాను కూడా మారుతి సీక్రెట్ గానే మారుతి తెరకెక్కించాడు. మరో సినిమాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆ సినిమాకు తన అసిస్టెంట్ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి.. చడీ చప్పుడు లేకుండా మూవీ తెరకెక్కించి విడుదల చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కూడా సైలెంట్ గా పనిచేసిన మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

Also Read

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

మరోసారి రాపో డబుల్​ రోల్​.. వర్కవుట్ అవుతుందా?

అన్నా మీ నంబర్​ ఇవ్వండి.. తేజ్​ ఫన్నీ ఆన్సర్​..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -