సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

- Advertisement -

సినిమా మేకర్స్ ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సినిమాల కు సంబంధించిన సన్నివేశాలు, సెట్లో వర్కింగ్ స్టిల్స్ బయటకు వస్తున్నాయి. రాజమౌళి వంటి దర్శకుడు సెట్స్ వద్ద కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆయన సినిమాల్లో నటించే నటులు కానీ, ఇతర సిబ్బంది కానీ సెట్లోకి మొబైల్ ఫోన్ తీసుకు రాకుండా కట్టడి చేస్తున్నారు. అంత కఠిన నిబంధనలు పాటిస్తున్నా ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ యాక్షన్ సీన్ కొన్ని నెలల కిందట బయటకు వచ్చింది.

కొన్నేళ్ల కిందట పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా ల్యాబ్ నుంచి ఏకంగా ఫస్టాఫ్ మొత్తం ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చింది. చాలామంది ఈ సినిమాను విడుదలకు ముందే చూశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ట్యాక్సీవాలా సినిమా ఏకంగా మొత్తం ప్రింట్ బయటకు వచ్చింది. దీంతో మేకర్స్ హడావిడిగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. సైరా సినిమా విడుదల కాకముందే అందులో చిరంజీవి వర్కింగ్ స్టిల్స్, ఆయన గెటప్ స్టిల్స్ బయటకు వచ్చాయి.

- Advertisement -

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ప్రారంభమైన రోజు సెట్స్ లో పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి. తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి ఓ సీన్ లీక్ అయ్యింది. సెట్స్ లో ఎవరో మొబైల్ ఫోన్ తో మహేష్ సంభాషణ చెబుతున్న సమయంలో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దీనిపై మహేష్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ సినిమాకు సంబంధించిన కథా నేపథ్యం ఏమిటి అనేది సస్పెన్స్ లో పెట్టి షూటింగ్ చేస్తుండగా.. ఇలా లీక్ లు బయటకు వచ్చి కథ ఏంటో ప్రేక్షకులు తెలిస్తే వారికి సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని మహేష్ అన్నట్లు సమాచారం. షూటింగ్ స్పాట్ లలో సెక్యూరిటీని పెట్టడంతోపాటు, సెట్స్ లోకి మొబైల్ ఫోన్లను అనుమతించకపోయినా ఏదో ఒక విధంగా సినిమాలకు సంబంధించిన లీకులు బయటకు వస్తున్నాయి. లీకు రాయుళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే కానీ మున్ముందు ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదని అంటున్నారు.

Also Read

‘తమిళ’ బాట పట్టిన బోయపాటి?

శంకర్​ సినిమాలో చెర్రీ డ్యుయల్​ రోల్​ ?

నా బయోపిక్​ తీయకండి.. ప్లీజ్​

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -